Abhishek Bachchan: విడాకులపై మొదటిసారి స్పందించిన అభిషేక్.. ఆమె వల్లే జీవితం నాశనం అంటూ..!

Abhishek Bachchan.. గత కొన్ని రోజులుగా మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్, ఈమె భర్త ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ వార్తలకు తగ్గట్టుగానే వీరు కూడా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కొంతమంది ఏకంగా విడాకులు తీసుకున్నారు అంటూ కూడా వార్తలు సృష్టించారు. కానీ ఐశ్వర్యరాయ్ ఇటు అభిషేక్ బచ్చన్ ఎవరు కూడా స్పందించలేదు. దీంతో త్వరలోనే విడాకులు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వార్తలు రాసుకుంటూ పోయారు. కానీ తాజాగా ఈ విషయాలన్నింటిపై అభిషేక్ బచ్చన్ తొలిసారి స్పందించారు.

Abhishek Bachchan: Abhishek's first reaction on divorce.. saying that life is ruined because of her..!
Abhishek Bachchan: Abhishek’s first reaction on divorce.. saying that life is ruined because of her..!

విడాకులు నిజమే..

2007లో ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఐశ్వర్యరాయ్ ,అభిషేక్ బచ్చన్ 16 సంవత్సరాల పాటు సంసారంలో సంతోషంగా కొనసాగారు. కూతురు ఆరాధ్య పుట్టిన తర్వాత తమ జీవితమే మారిపోయిందని కామెంట్లు కూడా చేశారు. అయితే అనూహ్యంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై సహనం కోల్పోయిన అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవును విడాకులు నిజమే. ఈ విషయం చెప్పినందుకు మీకు మరిన్ని ధన్యవాదాలు. మరి ఆ తర్వాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండి అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

మా ప్రేమ గురించి మూడో వ్యక్తి చెప్పాల్సిన పనిలేదు..

ఐశ్వర్యకు నాకు జీవితంలో మేము ఎలా ముందుకు వెళ్లాలో మాకు తెలుసు..? ఎలా బ్రతకాలి? అనేది కూడా మాకు బాగా తెలుసు. ఎవరో మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య పై నాకు ఎంత ప్రేమ ఉందో.. నాపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. మా ప్రేమ గురించి మీరు ఇలా తప్పుపట్టాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు అభిషేక్ బచ్చన్ . ఇక మొత్తానికైతే అభిషేక్ బచ్చన్ విడాకులపై స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చేసారని చెప్పవచ్చు.

- Advertisement -

కరీనాకపూర్ పై సంచలన కామెంట్స్..

అలాగే తన కెరీర్లో ఎదురైన విచిత్ర సంఘటన గురించి కూడా చెబుతూ కరీనాకపూర్ పై సంచలన కామెంట్లు చేశారు. ఒకరోజు సినిమా షూటింగ్లో భాగంగా రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఉండగా.. సీన్ మధ్యలో కరీనా కపూర్ నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి. నీతో నేను ఎలా రొమాంటిక్ సీన్స్ చేస్తాను అని చెప్పింది. అంతేకాదు సినిమాలో ప్రేమలో పడినట్లు ఎలా యాక్టింగ్ చేయాలి అని చెప్పింది. ఒక్కసారిగా ఆమె బ్రదర్ అని అనడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. రొమాంటిక్ సీన్లలో నటించే ప్రతిసారి కూడా ఆమె చెప్పిన మాటలే గుర్తొచ్చేవి. దాంతో నాకది చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆమె అలా చెప్పి జీవితంలో క్షమించలేని తప్పు చేసింది.. ఇలా మాటలు చెప్పడం వల్ల సినిమాలలో నటించలేము . ఫలితంగా జీవితాలు కూడా నాశనమవుతాయి అంటూ సరదాగా కామెంట్ చేశారు అభిషేక్ బచ్చన్. ప్రస్తుతం అభిషేక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా విడాకులపై స్పందించి అందరి నోర్లు మూయించారు అభిషేక్ బచ్చన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు