Varun tej: క్షమించరాని తప్పు చేసిన మెగా ప్రిన్స్.. అంత పెద్ద తప్పు ఏం చేశారబ్బా..?

Varun tej.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ తేజ్, ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈయన ఒక విషయంలో క్షమించరాని తప్పు చేశారట. ఈ విషయమై ఇప్పటికి తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి తనపై కోపంగా ఉన్నారంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.

Varun tej: Mega prince who made an unforgivable mistake.. What did you do so big a mistake..?
Varun tej: Mega prince who made an unforgivable mistake.. What did you do so big a mistake..?

వారిది పెద్దలు కుదిర్చిన వివాహం..

మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో వరుణ్ తేజ్ మాత్రమే. అటు చిరంజీవి , ఇటు నాగబాబు ఇద్దరూ కూడా పెద్దలు కుదిర్చిన అమ్మాయిలని వివాహం చేసుకున్నారు. ప్రముఖ దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య అప్పటికే ఎటువంటి గుర్తింపు లేని చిరంజీవిని ఏరి కోరి మరీ అల్లుడుగా తెచ్చుకున్నారు. అలాగే నాగబాబు భార్య పద్మజ కూడా సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచే వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనతో బద్రి , జానీ వంటి చిత్రాలు చేసిన రేణూ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెతో మనస్పర్ధలు తలెత్తిన తర్వాత విడిపోయి రష్యా కు చెందిన అన్నా లేజినోవా ను వివాహం చేసుకున్నారు.

వరుణ్ తేజ్ ప్రేమ , పెళ్లి..

అటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను వివాహం చేసుకున్నారు .కానీ వరుణ్ తేజ్ మాత్రం తన తోటి నటి లావణ్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో మిస్టర్ అనే సినిమా ద్వారా వీరిద్దరు కలుసుకున్నారు . అయితే అప్పటి పరిచయం స్నేహానికి దారి తీసి , ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది . అంతరిక్షం అనే సినిమాలో కూడా వీరిద్దరూ మళ్లీ నటించారు. 2023లో నిశ్చితార్థం చేసుకొని అదే ఏడాది నవంబర్ నెలలో వివాహం చేసుకున్నారు .ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యింది.

- Advertisement -

లావణ్య తో లవ్ విషయంలో చిరంజీవి ఫైర్..

ఇకపోతే లావణ్యతో వరుణ్ తేజ్ లవ్ విషయంలో చిరంజీవి బాగా కోప్పడ్డారట అందుకు కారణాన్ని కూడా చిరంజీవి స్వయంగా తెలిపారు. గతంలో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన ఈయనను.. యాంకర్ సుమా ప్రశ్నిస్తూ.. చిరు లీక్స్ అంటే అందరికీ ఇష్టం అన్ని విషయాలు లీక్ చేసే మీరు వరుణ్ తేజ్, లావణ్య లవ్ ఎఫైర్ ను ఎందుకు లీక్ చేయలేదు అంటూ అడిగారు. దానికి చిరంజీవి సమాధానం చెబుతూ ..వరుణ్ ప్రతి విషయం నాతో చెబుతారు.. ముఖ్యంగా వాళ్ళ నాన్నతో చెప్పుకోలేని విషయాలు కూడా నాకు చెబుతాడు. నేనే తనకు స్ఫూర్తి అంటాడు కానీ లావణ్యతో ప్రేమ విషయం మాత్రం నాకు చెప్పలేదు. అందుకే ఇప్పటికీ వాడిపైన నాకు కోపం ఉంది అంటూ తెలిపారు.

క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..

అయితే ఈ విషయంపై వెంటనే రియాక్ట్ అయిన వరుణ్ .. నాకు ఇప్పటికీ పెదనాన్న పైన గౌరవం ఉంది. అయితే ఆ గౌరవంతో కూడిన భయం కారణంగా నా ప్రేమ విషయం పెదనాన్న దగ్గర దాచాను. కానీ మొదట నా ప్రేమ విషయాన్ని చెప్పింది కూడా పెదనాన్నకే అంటూ వివరణ ఇచ్చారు వరుణ్ తేజ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు