OTT Movie : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్

OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక లాంగ్వేజ్ బారియర్ అనేది అడ్డు కాకుండా పోయింది. ఏ సినిమా ఏ భాషలో వచ్చినా సరే కంటెంట్ బాగుంటే ఓటిటి మూవీ లవర్స్ కచ్చితంగా ఆదరిస్తున్నారు. కొన్ని సినిమాలు ఓటీటిలోకి వచ్చే దాకా కూడా అవి రిలీజ్ అవుతున్నాయి అన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారి ఓటీటీలోకి వచ్చాక కథ బాగుంటే ఆటోమేటిక్ గా హైలైట్ అవుతుంది. భారీ సంఖ్యలో వ్యూస్ తో కథలో సత్తా ఎంత ఉందో కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా నిరూపించుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో భాషకు సంబంధించిన మూవీ చేరింది. ఈ మూవీ ఓ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం విశేషం. మరి ఈ మూవీ పేరేంటి? స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సైన్స్ ఫిక్షన్ మూవీ బ్లింక్. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రను పోషించిన ఈ బ్లింక్ మూవీ మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. అసలు బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం విశేషం. మే నెలలోనే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొన్నాళ్లకే బ్లింక్ మూవీ ఓటీటీలో కనిపించకుండా పోయింది.. తాజాగా ఈ సినిమా కన్నడ తో పాటు తెలుగు వర్షన్ లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ఇదొక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ స్టోరీ. సై-ఫై సినిమాలను ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Blink OTT: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ..  ఊహించని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే? - Telugu News | Dheekshith Shetty  starrer Blink movie ...

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

1996, 2001, 2021, 2034 మధ్యలో కొనసాగే స్టోరీనే బ్లింక్. ఇందులో హీరో యాక్టింగ్ పైన ఉండే పిచ్చితో పై చదువులను మధ్యలోనే ఆపేస్తాడు. పైగా ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడు. అయితే హీరోకి ఈ సినిమాలో కనురెప్పలు కొట్టకుండా ఎంతసేపైనా అలాగే చూసే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే అతనికి ఇబ్బందిగా మారుతుంది. ఏదో కల వచ్చినట్టుగా అన్పించడం, నిల్చున్న చోటే వింత వింత అనుభవాలు ఎదురు కావడం జరుగుతుంది. హీరో ఇలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే హీరోకి ఓ వృద్ధుడు ఎదురు పడతాడు. ఆయన చెప్పిన కొన్ని షాకింగ్ విషయాలు పరిస్థితులు అన్నింటిని తారుమారుగా చేస్తాయి. అసలు ఆ వృద్ధుడు హీరోకి ఏం చెప్పాడు? హీరోకి టైం మిషన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ ముసలాయన ఎవరు? హీరోకే ఎందుకు కనిపించాడు ? హీరోకి అసలేం జరుగుతోంది? అనే విషయాలు తెలియాలంటే బ్లింక్ మూవీ ని చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా బ్లింక్ మూవీని చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు