Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు మధ్య ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మధ్య ఎంత స్నేహ అనుబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి అనుబంధం ఉంది. ఇకపోతే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితమైన వ్యక్తి బన్నీ వాసు. వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చాలా సందర్భాలలో అల్లు అర్జున్(Allu Arjun) మాట్లాడుతూ నేనే బన్నీ వాసు బన్నీ వాసే నేను అంటూ కూడా చెబుతూ వచ్చారు. అలానే బన్నీ వాస్ కూడా చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ తరఫున చాలా విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇక రీసెంట్ టైమ్స్ లో వీరిద్దరి మధ్య స్నేహం చేరింది అంటూ కొద్దిపాటి కథనాలు ,వార్తలు వినిపిస్తూ వచ్చాయి. వీటికి ఏ రోజు బన్నీ వాసు స్పందించలేదు. ఇక రీసెంట్గా ఆయ్ సినిమా వేడుకలో బన్నీ వాసు దీనిపైన స్పందించారు.
నాకు బన్నీ గారికి మధ్య నాకోసం ఇది చేయండి అని అడగడాలు ఉండవు. నాకు ఏం కావాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నాకు ఎటువంటి టైంలో నిలబడాలో ఆయనకు బాగా తెలుసు. కేవలం నా కోసమే కాదు ఎవడైనా ఫ్రెండ్ లోలో ఉన్నాడంటే వాడిని చెయ్యి పట్టి బయటకు తీసుకురావడం ఆయనకు అలవాటు. ఆయన ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇస్తారు. నా సినిమా గురించి కూడా నేను ట్విట్ చేయమని ఆయనకు చెప్పలేదు. ఈ సమయంలో ట్వీట్ చేస్తే ఇది వీడికి ఉపయోగపడుతుంది అని ఆయనకు ఆయనే నా సినిమాను ప్రమోట్ చేశారు.
ఇక తను గీతా ఆర్ట్స్ (Geetha Arts) లో ఉన్న టైంలో ఒక చిన్న తప్పిదం జరిగిందని, ఆ టైంలో అల్లు అరవింద్ గారితో కూడా ఆర్గ్యుమెంట్ చేసి బన్నీ వాసు గీత ఆర్ట్స్ లోనే ఉంటాడు అని తనకోసం నిలబడ్డారు అంటూ బన్నీ వాసు చెప్పుకొచ్చారు.ఫ్రెండ్ కోసం ఎప్పుడు ఎలా నిలబడాలో తెలిసిన ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ అంటూ బన్నీ వాసు ఎమోషనల్ అయ్యారు.