Naga Chaitanya- Samantha: అక్కడ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ – ఇక్కడ సమంత డేటింగ్

Naga Chaitanya- Samantha:  ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బెస్ట్ కపుల్ లిస్ట్ తీస్తే వారిలో సమంత నాగచైతన్య (Naga Chaitanya- Samantha) పేరు కూడా వినిపించేవి. వీరిద్దరూ ఏం మాయ చేసావే అనే సినిమాతో పరిచయమై, ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించి ఇద్దరు రెండు వేరు వేరు సాంప్రదాయాలలో ఏడడుగులు వేసి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలం వీరిద్దరి మధ్య బాంధవ్యం బాగానే ఉన్నా కూడా కొన్ని వ్యక్తిగత కారణాలు కారణంగా ఇద్దరు విడిపోవలసి వచ్చింది. ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని విడిపోయారు. అయితే ఎవరి వ్యక్తిగత జీవితం వారిది.

ఇకపోతే ఒకవైపు సమంత వరుస సినిమాలతో తన కెరీర్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో సమంతకు గుర్తింపు వచ్చింది. కేవలం థియేటర్ సినిమాలు మాత్రమే కాకుండా ఓటిటిలో కూడా తన సత్తా చాటుతుంది సమంత. హీరోయిన్ గా ఒకప్పుడు సినిమాలు చేసిన సమంత ఇప్పుడు ఫిమేల్ లీడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో తన ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ తాను నిలబడుతూ పదిమందికి ఆదర్శంగా ఉంటుంది సమంత. ఇక నాగచైతన్య విషయానికి వస్తే తన కెరీర్ విషయంలో తను బిజీగా ఉన్నాడు.

Naga Chaitanya and Sobhita's engagement

- Advertisement -

ఇక రీసెంట్ గా నాగచైతన్య హీరోయిన్ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలం పాటు కలిసి ప్రయాణం చేసిన వీరు అధికారికంగా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో నాగచైతన్య మాజీ భార్య సమంత గురించి కొన్ని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.’ది ఫ్యామిలీ మాన్'(The family Man) డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ, బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రాజ్ డీకే (Raj Dk) డైరెక్షన్లో ‘ఫ్యామిలీమాన్-2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీసుల్లో సమంత నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు