Harish Shankar: హరీష్ శంకర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.? జర్నలిస్టు తో కలిసి డ్యూయెట్ పాడనున్న హరీష్

Harish Shankar: హరిష్ శంకర్ అనగానే అందరికీ గబ్బర్ సింగ్ (Gabbar Singh) తీసే దర్శకుడుగా మాత్రమే గుర్తొచ్చే ఉండొచ్చు. కానీ హరీష్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. హరీష్ శంకర్ దర్శకుడు అవ్వడానికంటే ముందు నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. థియేటర్ ఆర్టిస్ట్ గా కొన్ని నాటికలు కూడా వేశాడు. అయితే ఉన్నతమైన చదువులు చదువుకుని కూడా సినిమాల మీద ఆసక్తితో ఏదో సాధించాలని అమెరికాకు కూడా ప్రయాణం అవ్వకుండా ఇక్కడే ఉంటూ నేడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు.

షాక్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్, మొదటి సినిమా డిజాస్టర్ తోనే డీలా పడిపోకుండా మళ్లీ రచయితగా ప్రయాణాన్ని మొదలుపెట్టి మిరపకాయ్ సినిమాతో సక్సెస్ కొట్టి దర్శకుడుగా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు. ఇక గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ఆ సినిమాతో తన ఖాతాలో వేసుకున్నాడు హరీష్. ఇక ప్రస్తుతం హరీష్ రవితేజతో మూడోసారి మిస్టర్ బచ్చన్(Mr Bachchan) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

Harish Shankar

- Advertisement -

 

ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా హరీష్ శంకర్ ఒక పాటను పాడారు. పాటను పాడడం వేరు ఆ పాటను లయబద్ధంగా వినసొంపుగా పాడటం వేరు అచ్చం హరీష్ శంకర్ ఇదే చేశాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇంటర్వ్యూలో భాగంగా ఇదే పాటను ఒక నేషనల్ మీడియా వద్ద పాడారు. అలానే ఒక షోలో హాజరైన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుమార్తె ఆధ్య(Aadhya) కూడా ఇదే పాటను పాడారు. హరీష్ శంకర్ ఆ పాటను ఇంటర్వ్యూలో పాడిన వెంటనే సదరు జర్నలిస్ట్ మీరు మీ సినిమాల్లో పాటలు కూడా పాడొచ్చు అనగానే మనిద్దరం కలిసి డ్యూయెట్ పాడుదామని ఆవిడకు మాటిచ్చారు. ఇదివరకే హరీష్ మాటలకు ఎంత పదును ఉంటుందో చూసాం, అలానే హరీష్ పాటలుకు ఎంత మాధుర్యం ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు