Saripodha sanivaram: సరిపోదా శనివారం పై అంచనాలు మామూలుగా లేవుగా, టీవీ పార్టనర్ కూడా సెట్

Saripodha sanivaram: వివేకాత్రేయ (Vivek Athreya) నాని (Nani) కాంబినేషన్లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద చాలామందికి మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో అంటే సుందరానికి (Ante Sundaraniki) అని ఒక సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది. కానీ ఆ సినిమాకి ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హీరో నాని కూడా పర్సనల్గా ఆ సినిమా అంటే చాలా ఇష్టం. కేవలం నానికి మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగ నబా నటేష్ వంటి ఎంతోమందికి అంటే సుందరానికి సినిమా అంటే చాలా ఇష్టం.

బహుశా ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడం వలన దర్శకుడు వివేక్ ఆత్రేయ తన స్టైల్ మార్చి ఒక కమర్షియల్ హిట్ సినిమా చేయబోతున్నాడు అని అనుకోవచ్చు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ అన్ని కూడా విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాతో దర్శకుడులోని ఒక కొత్త యాంగిల్ బయటకు వస్తుంది అని చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ లోని చాలా అంశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నాని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తున్న కూడా కమర్షియల్ గా వర్కౌట్ కావడం లేదు. దీని కారణం గతంలో ఉన్న కొన్ని ప్రభుత్వ లోపాలు కూడా ఉన్నాయి.

Saripodhaa Sanivaaram

- Advertisement -

 

ఇక సరిపోదా శనివారం విషయానికి వస్తే ఈ సినిమాకి అన్ని విషయాలు బాగానే కలిసి వస్తున్నాయి. ఈ రీసెంట్ గా ఈ సినిమాకి టెలివిజన్ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం కానుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమాకి సంబంధించిన సగం బిజినెస్ జరిగిపోయింది. ఇక మెంటల్ మదిలో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వివేక్ ఆత్రేయ అంటే సుందరానికి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడు అని అందరూ ఊహించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. మరి ఈ సినిమాకి ఎటువంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు