Vishwambhara: బాస్ బర్త్ డే ప్లానింగ్ అదుర్స్, మెగా ఫ్యాన్స్ కి పండగే

Vishwambhara: బింబిసారా(Bimbisara) సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వశిష్ట. మొదటి సినిమాతోనే తన రేంజ్ ఏంటో చూపించి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. కళ్యాణ్ రామ్(Kalyan Ram) లాంటి హీరోతో కూడా ఆ టైంలో అద్భుతమైన హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. బింబిసార తో మంచి హిట్ అందుకొని దర్శకుడుగా తన తాను ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో నిలబడ్డాడు. రెండువ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి లాంటి దర్శకుడు తో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు.

వశిష్ఠ(Vashista) ప్రస్తుతం చేస్తున్న సినిమా విశ్వంభర. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష ఈ సినిమాలో కనిపించనుంది. ఏఆర్ మురుగదాస్(AR Muaragadas) దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన స్టాలిన్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ తో జతకడుతున్నారు త్రిష(Trisha). ఈ సినిమాను సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో తోనే మంచి అంచనాలను క్రియేట్ చేశారు. పంచభూతాలను ఏకం చేసే కాలచక్రాన్ని పోస్టర్ లో చూపిస్తూ ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి ఆడియన్స్ ఏ విధమైన అనుభూతిని పొందారో ఈ సినిమాను చూసినప్పుడు కూడా అదే రకమైన అనుభూతిని పొందుతారు. అని చాలా కాన్ఫిడెంట్ తో చెబుతున్నారు ఈ మూవీ టీం.

Viswambhara
ఇకపోతే ప్రతి హీరో పుట్టినరోజు సందర్భంగా వాళ్లు అప్పుడు చేస్తున్న సినిమా అప్డేట్ అనేది ఇవ్వడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో విశ్వంభర సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ టీజర్ కి సరిపడా విజువల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారట. ఆగస్టు 22న ఇంద్ర సినిమాతో పాటు విశ్వంభరా టీజర్ కూడా రానున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు