Kriti Sanon : తనకంటే పదేళ్లు చిన్నవాడితో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన కృతి..

Kriti Sanon : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ ఆ సినిమా ప్లాప్ కావడంతో బాలీవుడ్ వెళ్ళిపోయింది. అక్కడ వరుస సినిమాలతో మంచి సక్సెస్ ని కొట్టి స్టార్ హీరోయిన్ అయింది. ఇక లాస్ట్ ఇయర్ ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయి కృతి సనన్ ని కూడా ట్రోలింగ్ కి గురయ్యేలా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాల్లో నటిస్తుంది ఈ అమ్మడు. ఇక ఈ ఇయర్ ‘క్రూ’ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా కృతి సనన్ ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Kriti Sanon reacts to dating rumors

తన కన్నా పదేళ్లు చిన్నవాడితో డేటింగ్..

ఇక కృతి సనన్ బాలీవుడ్ (Bollywood) లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైం లో తన ఎఫైర్ వార్తలు నెట్టింట ఊపందుకున్నాయి. కృతి సనన్ కొన్నాళ్ల నుండి బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. అతను యూకే కి చెందిన కబీర్ బహియా అని వ్యాపార రంగంలో రాణిస్తున్న యువ వ్యాపారవేత్త అని సమాచారం. ఇతనితో కృతి సనన్ కొన్ని రోజులుగా డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. పైగా కృతి సనన్ కంటే అతను పదేళ్ల చిన్నవాడట. ఈ వార్తలు బాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుండగా, కృతి సనన్ ట్రోలింగ్ కి కూడా గురవుతుంది. అయితే ఈ వార్తలపై కృతి సనన్ స్పందించింది.

- Advertisement -

రూమర్లపై ఫైర్ అయిన కృతి సనన్..

ఇక కృతి సనన్ (KritiSanon) డేటింగ్ పై వస్తున్నఈ వార్తలపై కృతి సనన్ స్పందించింది. తనపై వస్తున్న ఈ రూమర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కృతి.. “తన గురించి తప్పుడు సమాచారం రాసినపుడు తనతో పాటు కుటుంబం కూడా బాధ పడుతుందని… దాని వల్ల వచ్చే పరిణామాలను తామంతా ఎదుర్కోవాలని చెప్పుకొచ్చింది.. “34 ఏళ్ల కృతి తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తోంది”… అంటూ హెడ్డింగ్ పెట్టి చాలా మంది తప్పుడు న్యూస్ రాశారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టమొచ్చినట్టు రాయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు జనాలు అప్డేట్ అయ్యారు. ఇలాంటి తప్పుడు రాతల్ని ఎవ్వరూ నమ్మడం లేదు అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఇలాంటివి ఫ్యామిలీస్ తో ఉన్న వారికి ఎంతో బాధపెడతాయని తెలిపింది. ఇక కృతి సనన్ ప్రస్తుతం ‘దో పత్తి’ అనే సినిమాలో నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు