i Bomma: ప్రేక్షకులకు శుభవార్త.. కొత్త ఆప్షన్ వారి కోసమే..?

iBomma.. గత కొన్నేళ్ల నుంచి చాలామంది సినిమా థియేటర్లకు వెళ్లకుండా సినిమా విడుదలైన మొదటి రోజే.. ఇంట్లోనే సినిమాలను వీక్షిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఐ బొమ్మ (i Bomma) యాప్ కారణమని చెప్పవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే వెబ్ సిరీస్ లు, సినిమాలు ఇందులో వీక్షించవచ్చు. ముఖ్యంగా టికెట్ ధరలు అధికంగా ఉండడం చేత వీటిని చూసే వారి సంఖ్య రోజుకీ పెరుగుతూనే ఉన్నది. సగటు ప్రేక్షకుడు ఎక్కువగా ఐ బొమ్మ వంటి వాటిలోనే సినిమాలను వీక్షిస్తూ ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటిపైన ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి.

iBomma: Good news for the audience.. the new option is for them..?
iBomma: Good news for the audience.. the new option is for them..?

అధిక బడ్జెట్ .. టికెట్ ధరల పెంపుకు కారణం..

టికెట్ల ధరలు పెరగడానికి ముఖ్య కారణం భారీ బడ్జెట్ పెట్టడమే అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి భారీగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. అందులో హనుమాన్ (Hanuman )సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమాలకు టికెట్ ధరలు పెంచలేదు.. సాధారణంగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ అయితే భారీగానే రాబట్టాయి. కానీ స్టార్ హీరోల చిత్రాలకు కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలి అంటే కనీసం రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అందుకే చాలామంది ఐ బొమ్మ లాంటి థర్డ్ యాప్స్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకొని మరి కుటుంబంతో సహా ప్రశాంతంగా సినిమాలను వీక్షిస్తూ ఉన్నారు.

ఇక పై ఐ బొమ్మ లో అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లో చూడవచ్చు..

అయితే తాజాగా ఐ బొమ్మ సైట్ లో ఇప్పుడు కొన్ని మార్పులను చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సైట్ లో కేవలం తెలుగు చిత్రాలే ఉండగా.. ఇప్పటి నుంచి తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఓటీటీ లో వస్తున్న అన్ని వెబ్ సిరీస్లను, సినిమాలను కూడా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట దీనిని సబ్ డైమండ్స్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి పేజీలు లేకుండానే సులువుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేశారట. ముఖ్యంగా అమెజాన్ , నెట్ఫ్లిక్స్ వంటి ఇతరత్రా ఓటీటీలలో వస్తున్న సినిమాలను సైతం ఫ్రీగానే చూడవచ్చు ప్రేక్షకులు. ఐ బొమ్మ వీక్షించే ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ వంటిది.

- Advertisement -

ఐ బొమ్మ జాగ్రత్త పడాల్సిందే..

బప్పం టీవీ గా పేరు మార్చుకున్న ఐ బొమ్మ సైట్ లో ఇవన్నీ కూడా సులువుగా చూడవచ్చు. గడచిన కొద్ది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు సైతం తమిళ రాకర్స్ అనే ఒక సైట్ అధినేతను సైతం అరెస్టు చేయడం జరిగింది. దీంతో అక్కడ నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో తమిళ రాకర్స్ సైట్ అడ్మిన్ ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఐ బొమ్మ కూడా చాలా జాగ్రత్తగా అన్నిటిని వ్యవహరిస్తూ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి అయితే తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ప్రేక్షకులకు గొప్ప శుభవార్త చెప్పవచ్చు. వేలకు వేలు ఖర్చుపెట్టి థియేటర్లలో సినిమాలు చూడలేని వారు ఇలా ఇంట్లోనే హాయిగా చూడవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు