Hero Darshan: ఆమెపై మోజుతో.. డీ గ్యాంగ్ తో దర్శన్.. వెలుగులోకి నిజాలు..!

Hero Darshan.. కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన సహ నటి అయిన పవిత్ర గౌడ (Pavitra Gowda)పై ఉన్న ప్రేమ కారణంగా ఒక అభిమానిని హత్య చేయడంతో దర్శన్ పేరు ఒక్కసారిగా పాపులారిటీ అందుకుంది. రేణుక స్వామి మర్డర్ కేసులో ఇప్పటికే చాలా ఆధారాలు కూడా అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ పవిత్ర గౌడ కు అసభ్యకరమైన మెసేజ్లు పంపించారని , రేణుక స్వామిని కిడ్నాప్ చేసి మరీ దర్శన్ హత్య చేయించారని దర్యాప్తులో తేలినట్లుగా సమాచారం.

Hero Darshan: With a crush on her.. Darshan with Dee Gang.. Truths come to light..!
Hero Darshan: With a crush on her.. Darshan with Dee Gang.. Truths come to light..!

ఘటనా స్థలంలో రక్తపు మరకలు, వేలిముద్రలు లభ్యం..

అయితే ఇదంతా దర్శన్, పవిత్ర గౌడ ఒక గ్యాంగ్ తో చేతులు కలిపి.. అభిమాని రేణుక స్వామి (Renuka swamy)ని చిత్రహింసలు పెట్టి మరీ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రేణుక స్వామి మరణించిన తర్వాత ఆ శవాన్ని కాలువలో పడేశారట. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తో పాటూ దర్శన్ కారుని అధికారులు గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేణుకా స్వామిని బెల్ట్ తో, కర్రలతో.. కట్టేసి మరీ కొట్టడమే కాకుండా కరెంట్ షాక్ ఇచ్చినట్లుగా కూడా తేలింది. అయితే ఆ మర్డర్ స్పాట్లో ఆనవాళ్లను కూడా బెంగళూరు పోలీసులు సేకరించి FSL కు పంపడం జరిగిందట. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత.. తాజాగా అందుకు సంబంధించిన రిపోర్టు రాగా ఆ రిపోర్టులో రేణుక స్వామి హత్య చేసినప్పుడు, అతని షర్టు దగ్గర, డెడ్ బాడీని తీసుకువెళ్లిన వెహికల్ లో రక్తపు మరకలు అలాగే వేలి ముద్రల పై కూడా క్లారిటీ వచ్చిందట.

డి గ్యాంగ్ తో శాంపిల్స్ మ్యాచ్..

FSL రిపోర్టులో తెలిపిన ప్రకారం డీ గ్యాంగ్ ఫింగర్ ప్రింట్స్ అక్కడ మ్యాచ్ అయినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో దాదాపుగా 70 శాతం వరకు ఎవిడెన్స్ రుజువైనట్టుగానే ఉన్నదంటూ తెలుపుతున్నారు.. ఇక కేవలం సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు ఆడియో సాంపిల్స్ రిపోర్టు వచ్చిందంటే పూర్తిగా బయట పడుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ రిపోర్టుల పైన న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శన్ కు జైల్లో రాజభోగాలు కల్పిస్తున్నారని, చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. దీంతో అధికారులు రూల్ ఎవరికైనా ఒకటే సాధారణ ఖైదీ లాగానే జైలు జీవితం గడిపేలా అక్కడ అధికారులు దర్శన్ ను ట్రీట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

దర్శన్ కు శిక్ష తప్పదా..

డీ గ్యాంగ్ కు చట్ట ప్రకారం ఇక మీదట చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రేణుక స్వామి కేసులో దర్శన్ , పవిత్ర గౌడ్ తో సహా మరొక 16 మంది జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ కేసు కనుక రుజువు అయితే నిందితులకు కఠిన శిక్షలు తప్పవు అంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు