Samantha: శోభితతో చైతూ ఎంగేజ్మెంట్.. 60% ఆస్తిపై చర్చలు..

సాధారణంగా ఎక్కడైనా ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు అంటే భర్త నుంచి భార్య ఖచ్చితంగా భరణం పొందుతుంది. ఇక సెలబ్రిటీల విషయంలో కూడా ఇది జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ సమంత విషయంలో మాత్రం ఎందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె కొన్ని కారణాలవల్ల అతడి నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. అయితే ఆ సమయంలో ఒక రూపాయి కూడా భరణంగా తీసుకోలేదు సమంత (Samantha). అయినా సరే ఆమెను చాలామంది విమర్శించారు. అయితే వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ.. ఒకవైపు హీరోయిన్ గా, మరొకవైపు నిర్మాతగా అడుగులు వేస్తోంది సమంత.

Samantha: Chaitu's engagement with Sobhita.. Talks on 60% property..
Samantha: Chaitu’s engagement with Sobhita.. Talks on 60% property..

నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్..

ఇదిలా ఉండగా నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితతో రిలేషన్ లో ఉన్నాడు.. 2021 లో సమంత నుంచి విడిపోయిన తర్వాత 2022లో ఈమెతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించినా.. వారు ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఏడాది ఆగస్టు 8వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరుపుకున్నారు నాగచైతన్య – శోభిత (Sobhita). అయితే చాలామంది ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతుంటే సమంత అభిమానులు నాగచైతన్య పై దుమ్మెత్తి పోస్తున్నారు. నాడు సమంత ప్రమేయం లేకపోయినా సమంతాను విమర్శించిన వారు కూడా నేడు సమంతాను పొగుడుతున్నారని చెప్పవచ్చు.

60 శాతం ఆస్తి వారి పైనే..

ఇదిలా ఉండగా మరొకవైపు సమంత ఒక డైరెక్టర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుందని వార్తలు నెట్ వైరల్ అవుతున్నాయి అందులో భాగంగానే ఈయన గురించి మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత తనపై ఉన్న 60 శాతం ఆస్తిని అనాధ పిల్లలకు రాసి ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట. దీని గురించి లాయర్లతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం . అంతేకాదు ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ (Prathyusha Foundation) స్థాపించి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఏదేమైనా అనాధల కోసం సమంత తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

సమంత కెరియర్..

ఇక సమంత విషయానికి వస్తే.. సిటాడెల్ (Citadel)అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె.. హనీ బన్నీ (Honey- Bunny) పేరుతో త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరొకవైపు మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తూ.. నిర్మాతగా కూడా అవతారమెత్తింది సమంత. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధిస్తే సమంత నిర్మాతగా సక్సెస్ అయినట్లే అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది సమంత. మరి ఈమె కూడా ఒక డైరెక్టర్ ను నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిజా నిజాలపై సమంత స్పందించాల్సి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు