Amitabh Bachchan – KBC 16: వామ్మో.. రియాల్టీ షో కోసం అంత పారితోషకమా.. ప్రైజ్ మనీ కంటే ఎక్కువే..?

Amitabh Bachchan – KBC 16: ఇటీవల రియాల్టీ షోలు బాగా ఎక్కువైపోయాయని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ విషయానికొస్తే , బిగ్ బాస్ , మీలో ఎవరు కోటీశ్వరులు, స్టార్ మహిళ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రియాల్టీ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్లో కొన్ని రియాల్టీ షోలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క రియాల్టీ షో దాదాపు 15 కు పైగా సీజన్లను కంప్లీట్ చేసుకుని దూసుకుపోతున్నాయి. అలాంటి షోలలో కౌన్ బనేగా కరోడ్ పతి (KBC)రియాల్టీ షో కూడా ఒకటి. ప్రస్తుతం హిందీలో 16వ సీజన్ జరుపుకుంటుంది. ఈ షో కి ఎప్పటిలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Amitabh Bachchan - KBC 16: Whammo is so rewarding for reality show.. More than prize money..?
Amitabh Bachchan – KBC 16: Whammo is so rewarding for reality show.. More than prize money..?

కేబీసీ – 16.. ఒక్కో ఎపిసోడ్ కి అన్ని కోట్లా..?

బాలీవుడ్ సూపర్ స్టార్ ఇటీవల ప్రజలు డిమాండ్ మేరకు KBC షో యొక్క 16వ సీజన్ కి తిరిగి వచ్చారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తప్ప మరెవరు కూడా ఈ కార్యక్రమానికి సరైన హోస్ట్ కాదనేది బాలీవుడ్ ప్రేక్షకుల భావన . అందుకే ఆయన మళ్ళీ తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సీజన్ కి బిగ్ బీ ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 16 ఎపిసోడ్ కి అమితాబ్ బచ్చన్ తీసుకుంటున్న పారితోషకం ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ సీజన్ లో ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా ఈయన రూ.5 కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.5 కోట్లు అంటే అమితాబ్ బచ్చన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అశ్వద్ధామ గా జీవించేసిన అమితాబ్..

ఇదిలా వుండగా అమితాబ్ బచ్చన్ ఒకవైపు బాలీవుడ్లో సినిమాలలో నటిస్తూనే మరొకవైపు టాలీవుడ్ చిత్రాలలో కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ ఇటీవల నిర్మించిన చిత్రం కల్కి 2898AD (Kalki 2898AD). సుమారు రూ .700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించగా , రూ.1200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నటించి అద్భుతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ పాత్రకు ఈయన తప్ప మరెవరు సెట్ కారు అనేంతలా ఆయన తన నట విశ్వరూపం చూపించారు. భారీ కట్ అవుట్ తో అశ్వద్ధామ మళ్లీ తిరిగి వచ్చాడా అనేంతగా జీవించేశారు అమితాబ్. అంతేకాదు ఈ వయసులో కూడా యాక్షన్స్ సన్నివేశాలలో అదరగొట్టేశారు. ఏది ఏమైనా ఈయన నటన పీక్స్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమా విజయం సాధించడానికి ఈయన పాత్ర కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు