Lavanya Tripati : మెగా ఫ్యామిలి చిన్న కోడలు, వరుణ్ తేజ్ భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు నటించిన సినిమా అన్ని మంచి టాక్ ను అందుకున్నాయి. అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు మంచి టాక్ ను అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ లుక్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో లావణ్య బేబీ బంప్స్ తో ఉన్నట్లు తెలుస్తుంది..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఈ అమ్మడు బేబీ బంప్స్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆ ఫోటోల పై మీరు ఒక లుక్ వేసుకోండి.
మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్, లావణ్య లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇటలీలో జరిగిన పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కపుల్ వారి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూ వైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు.. ఇక వరుణ్ కూడా కొత్త సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు.. మట్కా సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక లావణ్య నిత్యం లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. అలాగే లావణ్య కూడా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.. ఆ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.