Harish Shankar: థియేటర్ మేనేజ్మెంట్ ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి కోపరేట్ చేయండి

Harish Shankar: హరీష్ శంకర్ రవితేజ(Ravi Teja) కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా పైన విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అని అంటే అది మిస్టర్ బచ్చన్ అనే చెప్పాలి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన నాలుగు పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మొదటి పాట రిలీజ్ అయినప్పుడు బావుంది అని అనుకున్నారు. రెండో పాట రిలీజ్ అయినప్పుడు మాస్ బీట్ మామూలుగా లేదు అనుకున్నారు. మూడో పాట రిలీజ్ అయినప్పుడు మిక్కీ స్టైల్ లో సాంగ్ చాలా పీస్ ఫుల్ గా గా ఉంది అనుకున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్ బీట్ అయితే బ్లాక్ బస్టర్, సినిమాకి విపరీతమైన హైప్ తీసుకొచ్చిన సాంగ్ ఇది.

ఇకపోతే ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న తరుణంలో, నేడు కొన్ని ఏరియాల్లో ప్రీమియర్ షోస్ మొదలుపెట్టారు. అయితే బెంగళూరులో ఒక ప్రముఖ థియేటర్లో 6:10 నిమిషాలకి షో అని అనౌన్స్ చేశారు. అయితే టైం అయిపోయినా కూడా ఇంకా షో వెయ్యలేదు, ఇప్పుడు అడిగితే 7 తర్వాత అంటున్నారు అంటూ రవితేజ ఫ్యాన్స్ థియేటర్ మేనేజ్మెంట్ పై సీరియస్ అయిపోయారు. అయితే దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ సినిమా 7 తర్వాతే మొదలవ్వనుంది దయచేసి మేనేజ్మెంట్ ని ఇబ్బంది పెట్టకుండా కోపరేట్ చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.

Harish Shankar

- Advertisement -

ఇక ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ బయటకు వచ్చేసింది. తెలుగు ప్రాక్షకులు కూడా ఒక మాస్ కమర్షియల్ హిట్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి కొంతమంది దర్శకులు ఉన్నారు. కానీ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి అతి తక్కువ మంది దర్శకులు మాత్రమే సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో హరీష్ శంకర్ ఒకరు. వాస్తవికతకు దూరంగా అన్నీ మర్చిపోయి సినిమా అనే అద్భుతమైన ప్రపంచంలో ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో సినిమాలు చేయడమే హరీష్ శంకర్ లక్ష్యం అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు