Double Ismart: పూరి జగన్నాథ్ జీవితంలో అటో ఇటో రేపు తేలిపోతుంది

Double Ismart: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది దర్శకులుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే కొందరు కొన్ని గొప్ప సినిమాలు తీసినా కూడా కొంతమేరకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ అది తక్కువ మంది మాత్రం చాలా మంది పైన ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తారు. వాళ్లను చూసి తాము కూడా డైరెక్టర్ అవ్వాలి అనుకునే విధంగా సినిమాలను చేస్తారు. అలా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాలు చూసి మేము కూడా డైరెక్టర్ అవ్వాలి అనుకొని చాలామంది ఇండస్ట్రీకి బయలుదేరారు అని చెప్పాలి. ఒకప్పుడు ఇలాంటి ఇంపాక్ట్ రాంగోపాల్ వర్మ క్రియేట్ చేశాడు. ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు పనిచేసిన పూరి జగన్నాథ్ కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.

ఇక బద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ తర్వాత బాచి సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. కేవలం ఒక డైలాగ్ తోనే విజిల్స్ వేయించగల సత్తా ఉన్న దర్శకుడు. ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా రాయడం ఈయనకు మాత్రమే చెల్లింది. రైటింగ్ లో సినిమా టేకింగ్ లో ఒక కొత్త ఒరవడి పూరి జగన్నాథ్ సృష్టించాడు అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాద్ చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతుంది.

Puri Jagannadh

- Advertisement -

పూరి నుంచి చివరగా వచ్చిన సినిమా లైగర్, ఇక పూరి నుంచి ప్రస్తుతం రాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టర్ అయింది. ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఈ సినిమా వలన తీవ్రంగా నష్టపోయారు. కేవలం వీలు మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్ కూడా అమాంతం పడిపోయింది. ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా కొడితే గాని ఇంకో అవకాశం పూరి జగన్నాథ్ పట్టుకోలేడు. ఇక పూరి ఆశలన్నీ కూడా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా పైన ఉన్నాయి. పూరికి ఈ సినిమా హిట్ అవడం తప్ప మరో ఆప్షన్ లేదు. అయితే పూరి జగన్నాథ్ కెరీర్ ముందుకు వెళ్ళనుందా ఇంకా పాతాళంలోకి దిగిపోనుందా తెలియడానికి ఇంకొక రోజు మాత్రమే గడువుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు