MathuVadalara2 : క్లాసిక్ కామెడీ సీక్వెల్ ని పండక్కి తెచ్చే ప్లాన్ లో మేకర్స్…

MathuVadalara2 : టాలీవుడ్ లో ఈ మధ్య చాలా సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. పెద్ద సినిమా చిన్న సినిమా అన్న తేడా లేకుండా సినిమా మంచి సక్సెస్ అయితే దానికి ముందే సీక్వెల్ ని అనౌన్స్ చేసేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ ఇయర్ తెలుగులో టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు ఎలాంటి సక్సెస్ సాధించాయో తెలిసిందే. ఇక లేటెస్ట్ గా మరో కామెడీ సినిమాకు సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతుంది. టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సీక్వెల్స్ ఖచ్చితంగా కావాలని అనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో “మత్తు వదలరా” (MathuVadalara) సినిమా ఒకటి. అప్పట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తుందని తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

The makers are planning to release Mathu Vadalara 2 on Diwali

పండక్కి సీక్వెల్ రిలీజ్..

లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా ప్రారంభం కాగా, ఫస్ట్ పార్ట్ లో నటించిన శ్రీసింహ కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య, రితేశ్‌ రాణా వీళ్ళే ఇప్పుడు రెండో పార్టు కూడా చేస్తున్నారు. 2019లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘మత్తు వదలరా’ ఘన విజయం సాధించింది. కొత్త కుర్రాళ్లతో ఆ సినిమా చేసిన డైరెక్టర్ రితేష్ రాణా ఇప్పుడు ‘మత్తు వదలరా 2’ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మళ్లీ ఎలాంటి సమాచారం లేకపోగా, తాజాగా అందిన ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసిందట. తక్కువ పనిదినాల్లోనే షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని తాజాగా 2024 దీపావళి పండగ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, సంగీత దర్శకుడిగా కాల భైరవ పని చేస్తున్నాడు. ఇక మత్తువదలరా సీక్వెల్ లో సత్య, శ్రీ సింహ, నరేశ్‌ అగస్త్య పక్కాగా ఉంటారు అని సమాచారం. అలాగే కొత్త నటులు కూడా ఎంట్రీ ఇస్తారట. అయితే సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నా పెద్ద సినిమాల పోటీ వినాయక చవితి నుండి దసరా దాకా ఉంది, కాబట్టి దీపావళికి ఫిక్స్ అయ్యారని సమాచారం. మరి మేకర్స్ నుండి అఫిషియల్ అప్డేట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు