Best Patriotic Songs : దేశభక్తిని రగిలించే గొప్ప పాటలు ఇవే!

Best Patriotic Songs : దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది. కొందరు జవాన్ గా, మరికొందరు కిసాన్ గా, ఇంకొందరు పోలీస్ గా దేశానికీ సేవ చేస్తూ ఉంటారు. అలాగే ఒక కూలి వాడైనా, ఒక కార్మికుడైనా, ఏ వృత్తి చేసే వాడైనా తాను నమ్మిన పనికి విలువనిస్తూ, దేశాభివృద్ధికి తోడ్పడే వాడు దేశభక్తుడు. ఇక దేశభక్తిని పెంపొందించే విషయాల్లో ఒకప్పుడు స్పీచ్ లు, పాటలు ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు సినిమాల ద్వారా కూడా దేశభక్తిని రగిలిస్తూ, యువతని ప్రేరేపిస్తున్నారు దర్శకులు. ఇక సినిమా ప్రేక్షకుల్లో రకాల ఆడియన్స్ ఉన్నా, అందర్నీ ఒక్క ధాటిపై తెచ్చేది మాత్రం దేశభక్తి సినిమాలు, పాటలే. ఇక తెలుగులో అలాంటి పాటలు సినిమాలు చాలా వచ్చాయి. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం (ఆగష్టు 15) సందర్బంగా దేశభక్తిని రగిలించే గొప్ప పాటల గురించి తెలుసుకుందాం..

Indian Best Patriotic Songs

తెలుగు వీర లేవరా – అల్లూరి సీతారామరాజు(Alluri Seetharamaraju)

నట శేఖర కృష్ణ నటించిన “అల్లురి సీతారామరాజు” చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’ పాట ఇప్పటికీ సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన పాట. అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రిటిష్ వారిపై పోరాటం జరిపే క్రమంలో ప్రజలలో దేశభక్తిని రగిలిస్తూ సమరానికి సిద్ధం చేసే పాట ఇది.

- Advertisement -

జనని జన్మ భూమిశ్చ – బొబ్బిలిపులి (Bobbili puli)

దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు నటించిన సినిమా బొబ్బిలిపులి. ఆర్మీ లో ఉన్న జవాన్లు చనిపోయినపుడు, అక్కడ ఉన్న వాళ్లకు ధైర్యం చెప్తూ, జవాన్ యొక్క గొప్పదనాన్ని వివరించే పాట ఇది.

ఏదేశమేగినా – అమెరికా అబ్బాయి (America Abbai)

విదేశాల్లో ఉన్న ఓ అబ్బాయి భారతదేశాన్ని కీర్తిస్తూ పాడిన ఈ పాటలో భారతదేశం యొక్క గొప్పదనాన్నీ వివరిస్తుంది. ఏదేశమేగినా ఎందుకాలిడినా.. అంటూ ఈ పాట తెలుగు వారికీ ఎంతో ప్రియమైనది.

మేమె ఇండియన్స్ – ఖడ్గం (Khadgam)

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన అద్భుతమైన దేశభక్తి చిత్రం “ఖడ్గం”. దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళని ఒక్కటి చేస్తూ, మేమె ఇండియన్స్ అంటూ సాగే ఈ పాట వింటుంటే ఇప్పటికీ గూస్బంప్స్ వస్తాయి.

జనని – RRR

ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా వచ్చిన RRR సినిమాలో ఉండే “జనని” పాట దేశభక్తిని పెంపొందించే విధంగా, స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగానికి నిర్వచనంగా ఈ పాట ఉంటుంది.

మా తుఝే సలాం – రెహమాన్ ప్రైవేట్ ఆల్బమ్ (A.R.Rahman)

ఏ ఆర్ రెహమాన్ కంపోస్ చేసిన అద్భుతమైన పాటల్లో ముందు నిలుస్తుంది “మా తుఝే సలాం” పాట. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్ని, గొప్పదనాన్ని వివరిస్తూ ఈ పాట ఉంటుంది.

సందేసే ఆతే హె – బోర్డర్ (Border)

బోర్డర్ లో ఉన్న సైనికుల కష్టాలను తెలియచేస్తూ, వారి ఇంటినుండి దూరంగా ఉంటూ దేశం కోసం యుద్ధంలో పోరాటం చేసే ప్రతి సైనికుడి జీవితాన్ని ప్రతిబింబించే పాట “సందేసే ఆతే హే”. ఈ పాట హిందీ బోర్డర్ సినిమాలోది కాగా, ఆ సినిమా 1971 కార్గిల్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది.

ఇవే కాక, మేజర్ చంద్రకాంత్, RRR, సింధూరం, జై లాంటి సినిమాల్లో ఎన్నో గొప్ప పాటలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు