Thangalaan : ఆ ఒక్కటే సినిమాకు ప్లస్.. విక్రమ్ ఖాతాలో హిట్ పడ్డట్లే..?

Thangalaan : తమిళ స్టార్ హీరో విక్రమ్ చియాన్ ( Vikram Chian) శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణ చిత్రాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తంగాలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రీమియర్ షోలతో మంచి టాక్ ను అందుకుంది. ఈరోజు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో ఒకసారి చూసేద్దాం..

నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ వంటివి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. అందులోని విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. నిన్న పడిన ప్రీమియర్ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మట్టి వాసనను సినిమాలో డైరెక్టర్ చూపించాడు. తంగలాన్ అనేది ఒక తెగ పేరు అట. ఆ తెగకి విక్రమ్ నాయకుడిగా ఉంటాడు. అందుకే అదే పేరుని సినిమాకి కూడా పెట్టారు. బంగారం తవ్వకం చుట్టూ ఈ కథ ఉంటుంది. ఇక ట్రైలర్ లో ఉన్న విధంగా సినిమాలోని ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రతి ఒక్కరు పోటి పడి మరి నటించారు. అటు మ్యూజిక్ కూడా బాగానే సెట్ అయ్యిందని తెలుస్తుంది. విజువల్స్, బీజీయం టాప్ నాచ్ లో ఉన్నాయట. విక్రమ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మల్టిప్లెక్స్ ఆడియన్స్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే ఎమోషన్స్ కూడా సినిమాలో కనిపిస్తున్నాయి.

Vikram Chian thangalan plus points and rating
Vikram Chian thangalan plus points and rating

తంగలాన్ ప్లస్ పాయింట్స్..

కొన్ని తెగల గురించి డైరెక్టర్ ఎలా చూపించాలని అనుకున్నాడో అలానే చూపించాడు. విక్రమ్ ను ఎప్పుడు చూడని విధంగా చూపించాడు. అదే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. విక్రమ్ పెర్ఫార్మన్స్ పీక్స్.. ప్రతి సీన్ లో తనవైపు ఆడియన్స్ ను తిప్పుకున్నాడు. ముఖ్యంగా అసలు…సిసలు.. అత్యంత సహఙమైన మట్టి వాసన అందించే సినిమాగా ఆడియన్స్ మనసు దోచుకుంది. మొత్తానికి తమిళ్ డబ్బింగ్ సినిమాకు మంచి టాక్ వస్తుందని తెలుస్తుంది. తెలుగు సినిమాలతో పోటీకి దిగిన విక్రమ్ మంచి టాక్ ను అందుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ తన మార్క్ ను చూపించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి షోతో పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ఎన్నిరోజులు ఆడుతుందో అనేది ఆసక్తిగా మారింది. అందుతున్న టాక్ ప్రకారం విక్రమ్ ఖాతాలో హిట్ పడినట్లే అని తెలుస్తుంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు