Naga Chaitanya: సమంత, శోభిత కంటే ముందే ఆ హీరోయిన్స్ తో ఎఫైర్..!

Naga Chaitanya.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జోష్ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నాగచైతన్య , మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని బెస్ట్ డెబ్యూ మేల్ క్యాటగిరిలో ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈయన అదే సినిమాలో కోయాక్టర్ గా నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. 2017లో వీరి పెళ్లి జరిగింది. కానీ పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ మనస్పర్ధలు రావడంతో 2021 అక్టోబర్ రెండవ తేదీన విడాకులు ప్రకటించారు.

Naga Chaitanya: Samantha had an affair with those heroines before Sobhita..!
Naga Chaitanya: Samantha had an affair with those heroines before Sobhita..!

సమంతతో విడాకులు.. శోభితతో ఎంగేజ్మెంట్..

విడాకుల సమయంలో సమంతను చాలామంది విమర్శించారు. ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంది అందుకే నాగచైతన్య వదిలేశాడు అంటూ రకరకాల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తర్వాత ఏడాది అంటే 2022లో శోభితాతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇక వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చినా ఈ విషయాలపై స్పందించలేదు. అలాగని కొట్టే పారేయలేదు కూడా. కానీ ఆగస్టు 8వ తేదీన ఈ వార్తలను నిజం చేస్తూ నాగచైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారు. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగచైతన్య తండ్రి ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నాగార్జున తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

నాగచైతన్య రాముడు కాదు కృష్ణుడు..

ఇదిలా ఉండగా మరొకవైపు నాగచైతన్య కు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. చూడడానికి ఎంతో అమాయకంగా, రాముడు మంచి బాలుడు అన్నట్టు కనిపించే ఈయన వాస్తవానికి కృష్ణుడు అని ఇండస్ట్రీలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య అమాయకపు ముఖాన్ని చూస్తే ఎవరైనా సరే పడిపోవాల్సిందే. అందుకే ఈయన చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

సమంత , శోభిత కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్..

నాగచైతన్య ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో యంగ్ హీరోయిన్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసి బైక్ రైడింగ్స్ కి కూడా వెళ్లేవారట.. ప్రధమంగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి పేరు ఎక్కువగా వినిపించింది. అంతేకాదు బాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్టార్ గా కొనసాగుతున్న మరొక హీరోయిన్ తో కూడా ఆయన ఎఫైర్ నడిపినట్లు సమాచారం. ఇక బంగార్రాజు చిత్రంలో చిన్న పాత్రలో తళుక్కుమని మెరిసిన దక్ష నగర్కర్ తో కూడా ఈయన కొద్ది రోజులు డేటింగ్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో కూడా రూమర్స్ వినిపించాయి. అమాయకంగా కనిపించే ఈయన శోభిత, సమంతా కంటే ముందే చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు వైరల్ గా మారడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు