HBD Arjun: అర్జున్ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవారో తెలుసా..?

HBD Arjun..సౌత్ ఇండియాలో అన్ని భాషలలో సైతం పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూడా ఒకరు. కెరియర్ ప్రారంభం నుంచి ఆయన ఎక్కువగా యాక్షన్ సినిమాలలో నటించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో, కామెడీ సినిమాలలో కూడా నటించారు అర్జున్. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఏకంగా విలన్ పాత్రలలో కూడా హీరోలను సైతం డామినేట్ చేసే పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు అర్జున్ సర్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

HBD Arjun: Do you know what would have happened if Arjun had not been a hero?
HBD Arjun: Do you know what would have happened if Arjun had not been a hero?

మొదట అసలు అర్జున్ కి సినిమాలలోకి రావాలని ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదట. తన కోరిక అంతా కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటూ ఉండేవారట అర్జున్. అందుకోసమే తాను మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. కానీ తన తండ్రి శక్తి ప్రసాద్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో అర్జున్ ను బాల్యం నుండే సినిమాలలో నటింపజేసేలా చేశారు. అలా అర్జున్ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉండి ఉంటే పోలీస్ ఆఫీసర్ అయ్యుండేవారు. కానీ తండ్రి కోరిక మేరకు ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరో అయిపోయారు. ఇక అర్జున్ తండ్రి కూడా మంచి నటుడే. కన్నడ సినీ పరిశ్రమలో అప్పట్లో సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించారట. అయితే ఈ విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు.

శక్తి ప్రసాద్ 1967లో ఇమ్మడి పులకేసి అనే సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో రాజ్ కుమార్ హీరోగా నటించారు. అతి తక్కువ సమయంలోనే శక్తి ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించడం జరిగింది. చాలామంది స్టార్ హీరోలతో కూడా కలిసి నటించారు శక్తిప్రసాద్. అలా ఆయన సినీ కెరియర్ 1986వ సంవత్సరం వరకు కొనసాగిందట. అయితే కొన్ని కారణాల చేత దురదృష్టవశాత్తు 1986 లోనే మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అర్జున్ తన తండ్రి కంటే మరింత పాపులారిటీ సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు.

- Advertisement -

అర్జున్ కుటుంబ..

ఇదిలా ఉండగా అర్జున్ కుటుంబ విషయానికి వస్తే.. ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్న విషయం తెలిసిందే ఇటీవలే పెద్ద కూతురు ఐశ్వర్య కు ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ కొడుకు ఉమాపతితో ఘనంగా వివాహం జరిపించారు. అంతేకాదు తన ఆస్తిలో సగభాగం కూతురు పేరు పైన కట్నం గా రాసి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కట్నం విషయంలో మాత్రం వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా పలు చిత్రాలలో హీరోయిన్గా నటించినా, ఇప్పుడిప్పుడే వరుస సినిమాలలో అవకాశాలు అందుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు