Upasana: స్వాతంత్య్ర దినోత్సవం.. గుండె బరువెక్కే పోస్ట్ చేసిన మెగా కోడలు..!

Upasana.. భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటుంది. కొన్ని గంటల క్రితమే ఢిల్లీ లోని ఎర్రకోటపై భారత ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగురవేసి గీతాలాపన చేశారు. దేశమంతా ప్రజలు పిల్లలను మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు జెండా ఎగరవేసి స్వాతంత్రాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే ఇలాంటి రోజున సంతోష పడాల్సింది పోయి మెగా కోడలు ఉపాసన గుండె బరువెక్కే పోస్ట్ చేసి అందరిని కంటతడి పెట్టించింది. మరి ఉపాసన చేసిన పోస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Upasana: Independence Day.. Mega Kodalu posted with a heavy heart..!
Upasana: Independence Day.. Mega Kodalu posted with a heavy heart..!

కోల్కతాలో మహిళా వైద్యురాలి పై అత్యాచార ఘటన..

మెగా కోడలు ఉపాసన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేసింది. కోల్కతాలో ఇటీవల మహిళా వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశాన్నే వణికించింది. ఆమె పోస్టుమార్టం లో ఒక్కొక్కటిగా వెలికి వస్తున్న నిజాలు చూస్తే మాత్రం.. ఇంత దారుణంగా ఆమెను హింసించారా అన్న బాధ కలుగుతుంది. ముఖ్యంగా ఆమెను హతమార్చిన వైనం వెన్నులో భయం పడుతుందనడంలో సందేహం లేదు. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది ఉపాసన.

గుండె బరువెక్కే పోస్ట్ చేసిన మెగా కోడలు..

మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఈ అత్యాచార ఘటన. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నాం..? దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక. స్త్రీలను వర్కు ఫోర్సులోకి తీసుకురావాలనే నా లక్ష్యం బలపడింది. వారికి భద్రత గౌరవాన్ని అందించేందుకు కృషి చేద్దాం అంటూ ట్వీట్ చేశారు ఉపాసన. ఇక ఒక వైద్యురాలికి జరిగిన ఈ ఘటనపై ఆమె బాధపడుతూ ఎమోషనల్ పోస్ట్ చేయడం అందరిని కదిలించింది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

ఉపాసన కెరియర్..

అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలిగా పేరు సొంతం చేసుకున్న ఈమె అపోలో వైస్ చైర్మన్ గా కూడా పనిచేస్తోంది. అంతేకాదు వైద్యరంగంలో వినూత్నమైన మలుపులు తీసుకొచ్చిన ఈమె ఉచితంగా అవసరమైన వారికి వైద్యాన్ని అందిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది. మరొకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వివాహం చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవికి కోడలిగా, మెగా కోడలిగా పేరు సొంతం చేసుకుంది. సమాజంలో జరిగే అన్యాయాలపై స్పందిస్తూ న్యాయం కోసం పోరాడే వారిలో ఉపాసన కూడా ఒకరు అని చెప్పాలి. ఇక తాజాగా కోలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను గుర్తు చేస్తూ ఇలాంటి సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించింది. స్వాతంత్ర్యమే లేని చోట స్వాతంత్ర్యం ఎలా జరుపుకుంటాము అన్నట్లుగా తన అభిప్రాయం తెలియజేసింది ఉపాసన. ఉపాసన చేసిన కామెంట్లకు ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతున్నారు. ఆడవారికి రక్షణ లేకుండా పోతుందని కొంత మానవ మృగాల నుండి కూడా ఆడపిల్లను రక్షించే దౌర్భాగ్యం ఏర్పడి.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం స్త్రీ గౌరవానికి ప్రతీక. అలాంటి ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదేమో అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు