Jr. NTR: తారక్ పేరు మార్చుకోబోతున్నారా..?

Jr. NTR.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తారక్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతో తాతకు తగ్గ మనవడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల అందరి మన్ననలు పొంది స్టార్ హీరో అయిపోయారు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన పేరు కూడా ఎన్టీఆర్ కావడంతో అందరూ ఈయనను జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ వచ్చారు. అయితే ఎక్కువ క్లోజ్ రిలేషన్ ఉన్నవారు మాత్రం తారక్ అని మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనే పదాన్ని తొలగిస్తారా అంటే అవును అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

Jr. NTR: Are you going to change Tarak's name..?
Jr. NTR: Are you going to change Tarak’s name..?

జూనియర్ కి బదులుగా మిస్టర్..

తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన ఒక అఫీషియల్ ప్రకటనలో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేయడంతో ఇక జూనియర్ అనే ట్యాగ్ లైన్ మార్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ కి ఇప్పటికే 40 సంవత్సరాల వయసు దాటిన నేపథ్యంలో జూనియర్ అనే ట్యాగ్ అవసరం లేదని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు జూనియర్ అనే పేరు పెద్దగా సెట్ అవడం లేదనేది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే తన బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే మిస్టర్ ఎన్టీఆర్ అని పెట్టుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక్కో అభిప్రాయం ఒక్కొక్కరిది..

అయితే మరి కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ అనేది ట్యాగ్ లైన్ కాదని, అదొక ఎమోషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది నందమూరి తారక రామారావు వారసత్వంతో అతని పేరుతోనే తారక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అని ఉండడమే బెటర్ అంటూ పోస్ట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు హాలీవుడ్ లో ఐరన్ మాన్ సినిమాలో చేసిన రాబర్ట్ డౌనే ను ఇప్పటికీ జూనియర్ అనే పిలుస్తున్నారు. అతని తండ్రి కూడా అదే పేరుతో హాలీవుడ్లో పాపులర్ అవడంతో ఈయనకు జూనియర్ అనే పేరు ఇప్పటికీ కొనసాగుతోందని సమాచారం.

- Advertisement -

అందుకోసమే పేరు మార్పా..

ఇక జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు కూడా ఎన్టీఆర్ పేరుతోనే ఇప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెడుతున్నారు ఈ కారణంగానే తారక్ పేరులో జూనియర్ అనే పదాన్ని తొలగిస్తున్నారేమో అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఎన్టీఆర్ టీం ప్రకటన ఎలా ఉన్నా.. ట్విట్టర్లో మాత్రం తారక హ్యాండిల్ నేమ్ జూనియర్ ఎన్టీఆర్ గానే ఉండడం మరో విషయం. మరి హ్యాండిల్ నేమ్ మారేంతవరకు పేరు మార్చుకున్నారు అనే వార్త నిజం కాకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ పేరు మార్చుకోబోతున్నారు అనే వార్తలకు త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు