Double Ismart Movie Review : డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ

Double Ismart Movie Review : పూరి పేరు చెప్తే పాపం అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. కారణం.. లైగర్ డిజాస్టర్. డ్యాషింగ్ డైరెక్టర్ అనే పేరున్న పూరి జగన్నాథ్‌కి లైగర్ చాలా సమస్యలను తెచ్చిపెట్టింది. కొద్ది రోజులు ఈయన అజ్ఞాతంలోకి వెళ్లారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నీ సమస్యలు క్లీయర్ అయ్యేది డబుల్ ఇస్మార్ట్‌ తోనే అనుకున్నారు. రామ్ పోతినేనితో చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. పూరి కంబ్యాక్ మూవీ అవుతుందని ఆయన అభిమానులు ఆశగా ఈ సినిమావైపు చూశారు. అలాంటి మూవీ ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా పూరికి కంబ్యాక్ ఇచ్చిందా…? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్ధాం…

కథ :

బిగ్ బుల్ ( సంజయ్ దత్ ) కి చెందిన మనీ ట్రక్ లను ఓల్డ్ సిటీలో ఉండే ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో… బిగ్ బుల్‌కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుందని, మూడు నెలలకు మించి బతకడని తెలుస్తుంది. కానీ, బిగ్ బుల్‌కు తన గోల్స్ రీచ్ అవ్వాలని, అలాగే ఎక్కువ రోజులు బతకాలని ఉంటుంది. ఇది జరగాలంటే మెమరీ ట్రాన్సఫర్ ఒక్కటే మార్గం అని డాక్టర్ థామస్ (మకరంద్ దేశ్ పాండే) చెబుతారు. దీంతో బిగ్ బుల్ బ్రెయిన్ కి సెట్ అయ్యే వారి కోసం సెర్చ్ చేస్తారు. దీనికి ఇస్మార్ట్ శంకర్ సరిగ్గా సెట్ అవుతారని తర్వాత తెలుస్తుంది. దీంతో హీరోను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ క్రమంలో ఏం జరిగింది…? హీరోయిన్ జన్నత్ (కావ్య థాపర్) శంకర్‌కి ఎలాంటి సాయం చేసింది? బిగ్ బుల్ కి చెందిన మనీ ట్రక్ లను హీరో ఎందుకు దొంగతనం చేశాడు..? మెమోరీ ట్రాన్సఫర్ తర్వాత ఏం జరిగింది..? ఇస్మార్ట్ శంకర్‌కి బిగ్ బుల్ కి ఉన్న పాస్ట్ ఏంటి..? పోచమ్మ (ఝాన్సి) పాత్ర ఏంటి..? అనేది సినిమాలో చూడాలి.

విశ్లేషణ :

అమ్మ సెంటిమెంట్‌తో పూరి జగన్నాథ్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, చిరుత, ఏక్ నిరంజన్, లోఫర్ లాంటి అమ్మ సెంటిమెంట్ సినిమాల్లో డబుల్ ఇస్మార్ట్ చేరిపోయింది. వీటిలో లోఫర్ మినహా అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే… అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ.. పూరికి కంబ్యాక్ మూవీ కాలేకపోయింది.

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్, ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్.. రెండు కూడా సైన్స్ ఫిక్షన్ మూవీసే. కానీ, ఇస్మార్ట్ శంకర్ కి వచ్చిన టాక్ డబుల్ ఇస్మార్ట్ కి రావడం లేదు. సెంటిమెంట్ సీన్స్ ఉన్నా… అవి కూడా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా లేదు. హీరో ఎనర్జిటిక్ ఫర్ఫామెన్స్‌తో థియేటర్‌లో కూర్చున్నా… కథనంలో లోపం ఉండడం వల్ల… సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా..? అని వేచి చూస్తూ ఉండాల్సి వస్తుంది.

సినిమా స్టార్టింగ్‌.. ఫ్లాష్ బ్యాక్. అమ్మ అంటే హీరోకు ఎంత ఇష్టమో చూపించాడు. తర్వాత విలన్, హీరో ఇంట్రడక్షన్స్ ను భారీగా ప్లాన్ చేశాడు. ఆ వెంటనే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ కథలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో స్టార్టింగ్‌లో కొన్ని నిమిషాల పాటు ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కానీ, దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు డైరెక్టర్. బోరింగ్‌గా సాగిన మూవీకి ఇంటర్వెల్‌లో వచ్చిన మెమరీ ట్రాన్సఫర్ సీన్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

సెకండాఫ్‌లో కూడా స్టార్టింగ్‌లో ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కానీ, అది క్యారీ అవ్వదు. మళ్లీ అదే బోరింగ్‌ సన్నివేశాలు వచ్చి ఆడియన్స్‌ని ఇరిటేట్ చేస్తాయి. క్లైమాక్స్ మాత్రం పర్వలేదు అని అనిపిస్తుంది. మరీ గొప్పా.. అని చెప్పలేం కానీ, ఒకే అనొచ్చు. ఇక బోకా అంటూ అలీ చేసిన ట్రాక్ అయితే ఒక్క మాటలో డిజాస్టర్. మూవీలో చెప్పుకోదగ్గవి అంటే… స్టెప్పామార్…, మాడ్ ముంత చోడ్ చింత.. రెండు సాంగ్స్‌తో పాటు క్లైమాక్స్‌ కొంత వరకు అని చెప్పొచ్చు అంతే.

ఎనర్జిటిక్ హీరో రామ్ తన పేరుకు మరోసారి జస్టిఫ్ చేశారు. కావ్య థాపర్ అందాలను ఆరబోయాడినికి ఎక్కడా తగ్గలేదు. సంజయ్ దత్ విలనిజం బాగానే ఉన్నా.. కొన్ని చోట్ల అతి చేశాడా… అనే ఫీలింగ్ వస్తుంది. అలీ పాత్ర సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇంకా చెప్పాలంటే.. సినిమాకు పెద్ద మైనస్ కూడా అయింది. మణిశర్మ మ్యూజిక్ పర్లేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

రెండు పాటలు
క్లైమాక్స్
రామ్ & కావ్య థాపర్ గ్లామర్

మైనస్ పాయింట్స్

కథనం
స్లో సీన్స్ ఎక్కువగా ఉండటం

మొత్తంగా… పూరి ఫ్యాన్స్‌కి స్మార్ట్‌గా డబుల్ దెబ్బ పడింది.

Rating : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు