Mega Family: మెగా కుటుంబంలో సంబరాలు.. మరో వారసుడు వస్తున్నాడా….?

 

Mega Family: టాలీవుడ్‌ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati), మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి అంతరిక్షం, మిస్టర్ సినిమాలలో నటించారు. ఆ రెండు సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించి అందరిని మెప్పించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు వీరిద్దరి ప్రేమను సీక్రెట్ గా కొనసాగించిన ఈ జంట వారి ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు.

కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా కుటుంబసభ్యులు ఇటలీలో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ (Varun Tej) సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా…. లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నాడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Varun Tej-Lavanya Tripathi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్, లావణ్య.. ఫోటోస్ వైరల్.. - Telugu News | Varun Tej Visits Tirumala With His Wife lavanya Tripathi, Video Goes Viral | TV9 Telugu
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు కాబోతున్నారని మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠి (Lavanya Tripati), వరుణ్ తేజ్ దంపతులు రెండు రోజుల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియోలో లావణ్య త్రిపాఠి కొంచెం బొద్దుగా, తన పొట్ట కనిపించకుండా చీరను కట్టుకుంది. దీంతో లావణ్య తీరును చూసిన వారు ఆమె ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు