#NBK50YearsCelebrations : పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకునే బాలకృష్ణ ఆ పని చేస్తున్నారా.?

#NBK50YearsCelebrations : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అంటే ఎన్టీఆర్ (Ntr) ఏఎన్నార్(ANR) సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna) వీరు పేర్లు వినిపించేవి. ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటా పోటీగా సినిమాలు చేసేవాళ్ళు. వీళ్ళ సినిమాలు ఎక్కువగా బాక్స్ ఆఫీస్ వద్ద బరిలో ఉండేవి. అయితే వీరిద్దరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. వీరిద్దరి ఫ్యాన్స్ ఒకప్పుడు విపరీతంగా గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోటీ పడుతూ ఉండేవాళ్ళు. అయితే ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ఫ్యాన్ వార్స్ తగ్గుతాయని చాలామంది భావించారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈవెంట్ కి మొదటి ఇన్విటేషన్ మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ ఫోటోను అధికారకంగా రిలీజ్ చేశారు. ఇకపోతే ఒకప్పుడు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సినిమాలలో కూడా ఒకరి మీద ఒకరు డైలాగులు వేస్తూ ఉండేవాళ్ళు. కేవలం హీరోలు మాత్రమే కాకుండా చాలామంది అభిమానులు కూడా బ్యానర్లలో భారీ డైలాగ్స్ తో గొడవపడుతూ ఉండేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్ వార్స్ కొంతమేరకు తగ్గాయి అని చెప్పాలి.

Megastar Chiranjeevi

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో గత పదేళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఆ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్టుగా నిలబడి, ఓటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి విజయాన్ని పొందుకున్నారు. మామూలుగా బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనబడటం అనేది అరుదుగా జరుగుతుంది. ఇక రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ మీద బాలకృష్ణకు ఎంత ప్రేమ ఉందో పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ మీద ప్రేమ గౌరవంతోనే మొదటిసారి మెగాస్టార్ చిరంజీవికి మొదటి ఇన్విటేషన్ ఇస్తారని సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు