Harish Shankar: ఇంత అవమానమా.. నెటిజెన్ స్క్రీన్ షాట్స్ వైరల్..!

Harish Shankar.. మోడ్రన్ రాఘవేంద్ర గా పేరు సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా మాస్ మహారాజా రవితేజతో తెరకెక్కించిన చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించారు. రిలీజ్ కి ముందు సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకోవడమే కాదు సినిమాపై హైప్ పెంచేసాయి. దీంతో సినిమాలపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వాస్తవానికి హరీష్ శంకర్ , రవితేజ కాంబోలో సినిమా అనగానే అభిమానులు ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇక అందులో భాగంగానే మిస్టర్ బచ్చన్ సినిమాపై కూడా ఆశలు పెంచుకున్నారు. ఎట్టకేలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు సినిమాను విడుదల చేయడం జరిగింది.

Harish Shankar: What a shame.. Netizen screenshots go viral..!

Harish Shankar: What a shame.. Netizen screenshots go viral..!

మిస్టర్ బచ్చన్ సినిమాపై దారుణమైన ట్రోల్స్..

ఎంతో ఆత్రుతగా సినిమా కోసం థియేటర్ కి వెళ్లిన అభిమానులకు తీరని నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. దీంతో సినిమాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ మహారాజా అభిమానులు సైతం ఈ సినిమాపై ట్రోల్స్ చేయడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమా చూసిన వారు కూడా తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ సినిమాపై పూర్తిస్థాయిలో నెగెటివిటీ స్ప్రెడ్ చేసేస్తున్నారు.. పైగా నెగిటివ్ రివ్యూలతో ట్విట్టర్లో సంచలనం సృష్టిస్తూ ఉండడం గమనార్హం.

సినిమాపై నెగటివ్ రివ్యూ..

ముఖ్యంగా ఈ సినిమా తీసిన హరీష్ శంకర్ కి డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఒక సినిమానా..? ఇలా కూడా సినిమా తీస్తారా ? అంటూ దారుణంగా ఏకిపారేస్తూ హరీష్ శంకర్ ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అయితే ప్రేక్షకులు ఇచ్చే రివ్యూలను గమనిస్తున్న డైరెక్టర్ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లకు రిప్లై ఇస్తూ, నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లను పక్కన పడేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పసిగట్టిన ఒక నెటిజన్ ఎంతకు తెగించాడంటే హరీష్ శంకర్ పరువు మొత్తం తీసేశారు.. ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకెక్కడ ఉండదేమో..

- Advertisement -

డైరెక్టర్ ను ఘోరంగా అవమానించిన నెటిజన్..

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్..” ఫేక్ రివ్యూలను నమ్మకండి.. సినిమా చాలా బాగుంది.. రవి అన్నకు మంచి కం బ్యాక్ ఇచ్చావు హరీష్ శంకర్.. థాంక్యూ సో మచ్ ” అంటూ ప్రశంసలు కురిపించాడు. దీంతో డైరెక్టర్ వెంటనే “థాంక్యూ” అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక డైరెక్టర్ రిప్లై పై రియాక్ట్ అయిన ఆ నెటిజన్” నువ్వు రిప్లై ఇస్తావని తెలిసి , నేను ఈ సొల్లు చెప్పాను” అంటూ డైరెక్టర్ కి షాక్ ఇచ్చాడు ఆ నెటిజన్. దీంతో డైరెక్టర్ కి కాస్త పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. దీంతో పలువురు నెటిజన్లు నవ్వుకుంటూ ఉంటే మరికొంతమంది రిప్లై కోసం డైరెక్టర్ పరువు కూడా తీసేశావంటూ ఆ నెటిజన్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఈ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు ఏది ఏమైనా హరీష్ శంకర్ కి ఘోరమైన అవమానం జరిగిందని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు