Puri Jagannadh : మీరు సరిగ్గా ప్లాన్ చెయ్యకపోతే, ఆలీది ఏముంది బాసు.?

Puri Jagannadh : దర్శకుడు అవ్వడానికంటే ముందు ఎన్నో పనులు చేసుకుని ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక అవకాశాన్ని సాధించుకొని బద్రి(Badri) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ముందు నెగిటివ్ టాక్ ని సాధించుకున్న కూడా తరువాత మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు మొదటి సినిమాతోనే. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా చేసిన బాచి సినిమా డిజాస్టర్ గా మిగిలింది. వెంటనే రవితేజ హీరోగా చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

చాలా చిన్న కాన్సెప్ట్ సినిమాలు పూరి జగన్నాథ్(Puri jagannadh) ని స్టార్ డైరెక్టర్ ను చేసేసాయి. పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత చిన్న కాన్సెప్ట్ సినిమాలను చేయటం మానేసాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరితో కూడా పూరీ జగన్నాథ్ ఒకప్పుడు సినిమాలను చేశారు. కేవలం సినిమాలను చేయడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాడు. నేడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించుకున్న రామ్ చరణ్ తేజ్ మొదటి సినిమాకి దర్శకత్వం వహించింది పూరి జగన్నాథ్ అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ తీసిన సినిమాలేవి ఆకట్టుకోవట్లేదు. హీరోలకి అభిమానులు ఉన్నట్టే దర్శకులు కూడా ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అలా పూరి జగన్నాథ్ ను తమ అభిమాన దర్శకుడిగా ఫీలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పూరి జగన్నాథ్ ఒక హిట్ సినిమా తీస్తే బాగా సక్సెస్ ని ఎంజాయ్ చేసేది వాళ్లే. కానీ ఇప్పటివరకు పూరి జగన్నాథ్ టెంపర్ సినిమా తర్వాత ఒక హిట్ సినిమా కూడా తీయలేకపోయాడు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమా హిట్ అయిన కూడా అది ఫ్యాన్స్ కి అంత సంతృప్తి ఇవ్వలేదు. ఇక పూరి జగన్నాథ్ సినిమాలలో ఆలీకి ఒక ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ ఉంటుంది.

- Advertisement -

Ali

ఆలీ కామెడీ

ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, పోకిరి(Pokiri), చిరుత(Chirutha), సూపర్(Super) వంటి సినిమాలలో ఆలీ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక పూరి జగన్నాథ్ హిట్ సినిమా చేసి చాలా రోజులు అయిన కారణంగా ఇప్పుడు చేయబోయే సినిమాలో ఆలీకి కూడా ఒక కామెడీ ట్రాక్ ప్లాన్ చేసి ఇన్సర్ట్ చేశాడు పూరి. పూరి జగన్నాథ్ కథ తో పాటు ఆలీ కామెడీ ట్రాక్ ఒకప్పుడు వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు పూరి ఒక నాసిరకం కథ చేసి దానిలో ఆలీ కామెడీ ట్రాక్ ను అమర్చాడు అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఏదేమైనా ఒక సినిమా కథను ప్రాపర్ గా దర్శకుడు ప్లాన్ చేయకపోతే దానిలో ఎన్ని కామెడీ ట్రాక్స్ అమర్చనా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు అని మరోసారి రుజువైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు