Kavyathapar : ఒకే ఏడాది నాలుగు సినిమాలు.. కానీ?

Kavyathapar : టాలీవుడ్ బ్యూటీ కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఏక్ మినీ కథ సినిమాతో హీరోయిన్ గా ఫేమస్ అయింది. అంతకు ముందే ఈ మాయ పేరేమిటో సినిమాలో హీరోయిన్ గా నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఏక్ మినీ కథ తో సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో అందాల విందు చేసిన కావ్య థాపర్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించింది. హిందీలో మిడిల్ క్లాస్ లవ్ సినిమాలో నటించగా, తమిళ్ లో లాస్ట్ ఇయర్ బిచ్చగాడు2 సినిమాతో సక్సెస్ అందుకుంది. అయితే కెరీర్ బిగినింగ్ లో ఏడాదికి ఓకే సినిమా చేస్తూ వచ్చిన కావ్యా ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుండి వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ఈ ఇయర్ ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెల్సిందే.

Kavya Thapar has done four films this year

ఒకే ఏడాది నాలుగు సినిమాలు…

ఇక కావ్య థాపర్ ఈ ఇయర్ లో చూస్తూ, చూస్తూ నాలుగు సినిమాలు ఒకే చేయగా, ఈ విషయం చాలామందికి తెలీదు. అందులో ఆల్రెడీ రవితేజ తో నటించిన ఈగల్ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయిపొయింది. ఆ తర్వాత ఊరు పేరు భైరవకోన లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక లేటెస్ట్ గా రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ గా నటించగా, ఈరోజే ప్రేక్షకుల ముందుకు రాగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ విశ్వం సినిమాలో నటిస్తుంది. అయితే ఇన్ని ఆఫర్లు వచ్చినా ఈ అమ్మడికి సక్సెస్ మాత్రం కరువయింది.

- Advertisement -

ఈ ఒక్క సినిమా అయినా హిట్టవ్వాలి?

అయితే కావ్యా థాపర్ (Kavyathapar) ఈ ఏడాది నాలుగు సినిమాలో లైన్లో పెట్టినా, అందులో మూడు సినిమాలు ఎందుకూ ఉపయోగపడలేదు. రవితేజ ఈగల్ సినిమా డిజాస్టర్ గా నిలవగా, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సక్సెస్ అయినా అందులో సెకండ్ హీరోయిన్ కావడం వల్ల క్రెడిట్ కూడా పెద్దగా ఏమి రాలేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఆల్మోస్ట్ ప్లాప్ టాకే తెచ్చుకుందని సమాచారం. పైగా ఇందులో కావ్య పాటలకే పరిమితం అన్నట్టుగా ఉందట. ఇక చేతిలో ఉంది గోపీచంద్ విశ్వం సినిమా ఒక్కటే. ఇక ఈ అమ్మడి ఆశలన్ని ఆ సినిమా పైనే అని చెప్పాలి. మరి ఆ సినిమా అయినా సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు