Aay Movie Review : ‘ఆయ్’ మూవీ రివ్యూ

Aay Movie Review : ‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు చిన్న సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ భయపడతారు. కానీ ‘ఆయ్’ అనే సినిమా ధైర్యం చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతా ఆర్ట్స్’ లో రూపొందిన సినిమా కాబట్టి.. ప్రేక్షకులకి కూడా నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకం ఎంతవరకు ‘ఆయ్’ నిలబెట్టిందో తెలుసుకుందాం రండి :

కథ :

అమలాపురంలో ఉన్న ఓ పల్లెటూరుకి చెందిన కుర్రాడు కార్తీక్ (నార్నే నితిన్). అతనికి అనూహ్యంగా పల్లవి (నయన్ సారిక) అనే అమ్మాయి పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమెను చూసి ఇష్టపడతాడు. తర్వాత ఆమెతో పరిచయం ముదిరి ప్రేమగా మారుతుంది. కానీ పల్లవి పెద్దలు చూసిన పెళ్లి సంబంధం ఇష్టమని చెప్పడం హీరోకి అతని ఫ్రెండ్స్ కి షాక్ ఇస్తుంది.ఎందుకంటే ఆమె తండ్రి వీరవాసరం దుర్గ (మైమ్ గోపి)కి విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్. ఆమెకు కూడా ఉంటుంది కానీ.. మెల్లగా ఆమె మారుతుంది. అయితే ప్రేమించిన కార్తీక్ ని తన తండ్రి ఎక్కడ చంపేస్తాడో అని భావించి ఆమె అలా ప్రవర్తిస్తుంది.అయితే పల్లవిని దక్కించుకోవడానికి కార్తీక్ ఏం చేశాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు సుబ్బు (రాజ్ కుమార్ కసిరెడ్డి), హరి (అంకిత్ కొయ్య) ఎలా సాయపడ్డారు? మధ్యలో అడబాల బూరయ్య (వినోద్ కుమార్) పాత్ర ఏంటి? అనేది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ :

గోదావరి నేపథ్యంలో సినిమా. అది క్యాస్ట్ ఫీలింగ్ చుట్టూ అల్లుకున్న కథ అంటే మనకి ‘రంగస్థలం’ వంటి ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. స్నేహితులు చుట్టూ అల్లిన కామెడీ అంటే ఇటీవల విడుదలైన ‘కమిటీ కుర్రోళ్ళు’ గుర్తుకువస్తుంది. ‘ఆయ్’ విషయంలో కథగా చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ ఉండదు. కానీ పాత్రల స్వభావం వేరు. ‘కమిటీ కుర్రోళ్ళు’ లో ఎంత కామెడీ ఉన్నప్పటికీ అంతర్లీనంగా ఎమోషనల్ యాంగిల్ కూడా ఇమిడి ఉంటుంది. అది పల్లెటూరి జనాలకి మాత్రమే కాదు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునే గోదావరి కుర్రోళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ‘ఆయ్’ లో మొదటి నుండి చివరి వరకు గోదావరి జనాలకి ఉండే ఎటకారం, మొహమాటం’ పై ఫోకస్ చేశాడు దర్శకుడు అంజి కె మణిపుత్ర. అంతేకాదు పనిలో పనిగా వైసీపీ వాలంటీర్ వ్యవస్థ గురించి, అలాగే పల్లెటూళ్లలో అరుగు పై కూర్చుని పుకార్లు చెప్పుకునే బ్యాచ్ గురించి, రచ్చబండ వంటి వాటి వద్ద యూత్ పెట్టుకునే మీటింగ్లు.. వంటి వాటిని కూడా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ లో మొదట్లో ఓకే అనిపించినా తర్వాత వేగం తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ పెద్ద హడావిడి చేయకుండా సింపుల్ గా ముగించారు. నిర్మాతలు బన్నీ వాస్, విద్యా కొప్పినీడి.. కథకి తగ్గట్టు ఎంత ఖర్చుపెట్టాలో అంత ఖర్చు పెట్టారు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

నార్నె నితిన్ మ్యాడ్ కంటే బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొంతవరకు ఇంప్రూవ్ అయ్యాడు కానీ.. ఎమోషనల్ సీన్స్ దగ్గర తేలిపోయాడు. అలాంటి కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే.. ఎక్కువగా ట్రోల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి.. ఫ్రెండ్స్ గ్యాంగ్ ని అడ్డం పెట్టుకుని లాంగించేసే సినిమాలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ఇద్దరూ ఫ్రెండ్స్ గా మెప్పించారు.తమ మార్క్ కామెడీతో సినిమాని బాగా ఎంగేజ్ చేశారు. వీటీవీ గణేష్, సరయు..ల ట్రాక్ ఓకే అనిపిస్తుంది. మైమ్ గోపి మంచి నటుడు. అతనికి సరైన రోల్స్ పడటం లేదు. ఇందులో కూడా అతని పాత్ర సో సో గానే ఉంది. మిగిలిన నటీనటుల పాత్రలు కథకి తగ్గట్టు వచ్చి వెళ్తుంటాయి.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

కామెడీ

క్లైమాక్ ను ముగించిన తీరు

మైనస్ పాయింట్స్ :

కొత్తదనం లేకపోవడం

సెకండాఫ్ కొంత ల్యాగ్ అనిపించడం

చివరిగా.. ‘ఆయ్’ గోదావరి ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మిగిలిన ప్రేక్షకులు కూడా గోదావరి మార్క్ ఎటకారాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీకెండ్ కి బెస్ట్ ఛాయిస్. ‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు చూసి విసిగిపోయిన వారికి ‘ఆయ్’ కచ్చితంగా రిలీఫ్ ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు