RamCharan : గ్లోబల్ స్టార్ పై హాలీవుడ్ ఫ్రెంచ్ స్టార్ ప్రశంసలు..

RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడైతే RRR చేసాడో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకుంటున్నాడు. హాలీవుడ్ స్టార్లను కూడా ఇంప్రెస్ చేసాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వరల్డ్ వైడ్ గా ప్రశంసలు అందుకున్నాడు. దర్శకుడిగా రాజమౌళి జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజాలతోనే కితాబునందుకున్నాడు. అయితే అందరికంటే ఎక్కువగా వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కి గుర్తింపు దక్కుతుంది. ఆ మధ్య బ్రెజిల్ ప్రధాని కూడా రామ్ చరణ్ నటనకు ఫిదా అయిపోయాడు. ఇక తాజాగా మరో హాలీవుడ్ ఫ్రెంచ్ హీరో రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు.

Hollywood French star Lucas Bravo praised RamCharan

గ్లోబల్ స్టార్ పై ఫ్రెంచ్ స్టార్ ప్రశంసలు..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (RamCharan) నటనని ప్రశంసిస్తూ, తాజాగా ఫ్రెంచ్ నటుడు ‘లుకాస్ బ్రావో’ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అలాగే రామ్ చరణ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇండియన్ సినిమాలేవైనా చూసారా ? అని యాంకర్ అడగగా.. ఆ నటుడు RRR సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఇక సినిమా గురించి ప్రస్తావిస్తూ.. సినిమా లో మెయిన్ హీరో రామ్ చరణ్ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు.. అతని పేరు మరిచిపోయాను.. సరిగ్గా గుర్తు లేదు.. ఆర్మీలో ఉంటాడని.. పోలీస్ స్టేషన్ ఇంట్రో సీన్ దగ్గర అన్నట్టుగా, లూకాస్ బ్రావో అంటుంటే.. ఇంతలో యాంకర్ హింట్ ఇచ్చేసింది. అప్పుడు తాను మెయిన్ హీరో.. మెయిన్ యాక్టర్ అంటూ.. రామ్ చరణ్ గురించి సదరు ఫ్రెంచ్ నటుడు లుకాస్ బ్రావో చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తన నటన అద్భుతం…

ఇక ఫ్రెంచ్ నటుడు లూకాస్ బ్రావో రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన నటన అద్భుతంగా ఉందని, ఎంతో ఎమోషనల్‌గా నటించాడని, బ్రీత్ టేకింగ్‌లా అనిపించిందంటూ రామ్ చరణ్ పర్ఫామెన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన రాబోయే ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో కూడా వరల్డ్ వైడ్ గా తన క్రేజ్ ని మరింత పెంచుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అందులో రామ్ చరణ్ మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని సమాచారం. ఇక గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో క్రిస్మస్ స్పెషల్ గా రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు