Pushpa : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాతో హిట్ ట్రాక్ ను మొదలు పెట్టాడు.. ఆ తర్వాత వెనక్కి చూసుకోకుండా వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ గా మారాడు బన్నీ. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇకపోతే ఇన్నాళ్లకు ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులోని ఏ బిడ్డా సాంగ్ కోసం అల్లు అర్జున్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప.. మాస్ అండ్ యాక్షన్ కథతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇందులోని సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి. శ్రీవల్లి సాంగ్ తర్వాత ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే సాంగ్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో సపరెట్ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఆ పక్కా నాదే..ఈ పక్కా నాదే..తలపైనా ఆకాశం ముక్కా నాదే..ఆ తప్పూ నేనే ఈ ఒప్పూ నేనే..తప్పొప్పులు తగలెట్టే నిప్పూ నేనే..అంటూ ఊరమాస్‌గా సాగుతుంది పాట. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాయగా..నకాశ్ అజీజ్ పాడాడు. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ వైట్ ప్యాంట్, పూల చొక్కాలో ఓ చేతికి బ్రాస్లెట్, మరో చేతికి బంగారు వర్ణపు వాచ్ పెట్టుకుని ఈ పాటలో కొత్తగా కనిపించాడు.
ఆ పాట హిట్ అవ్వడం వెనుక చాలా కష్టం ఉందని గతంలో అల్లు అర్జున్, సుకుమార్ లు చాలా సార్లు చెప్పారు. అయితే ఈ పాట గురించి ఇన్నేళ్లకు ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ పాటలో అల్లు అర్జున్ 24 సార్లు కాస్ట్యూమ్ ను మార్చినట్లు తెలుస్తుంది. ఆ సాంగ్ లోని ఫిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అందుకే బన్నీ ఐకాన్ స్టార్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడ పుష్ప 2 సినిమా రాబోతుంది. ఆ సినిమాకు కూడా జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అది ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..