AAY Movie Collections : తారక్ బావ మరిది లక్ బానే ఉంది… ఫస్ట్ డే కలెక్షన్లు ఎలా వచ్చాయంటే…?

Narne Nithin: ఆగస్టు 15 సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం ఆగస్టు 15 కి నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ నాలుగింటిలో మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన ఆయ్ మాత్రం మంచి రెస్పాన్స్ సాధిస్తుంది. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో చాలా పెద్ద సినిమాలతో పాటు రిలీజ్ చేశాడు నిర్మాత బన్నీ వాసు. ఒకవైపు పూరి జగన్నాథ్(Puri Jagannadh), హరీష్ శంకర్ (Harish Shankar)వంటి దర్శకులు సినిమాల మధ్య ఈ సినిమాను ఏ దైర్యంతో రిలీజ్ చేస్తున్నారు అని అప్పట్లో ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ఈ కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది. మౌత్ టాక్ తో ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు బన్నీ వాసు.

AAY Movie

అప్పుడు బన్నీ వాసు(Bunny Vasu) చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆగస్టు 15 సందర్భంగా రిలీజ్ అయిన ఏ సినిమాలు పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. కేవలం పుష్పా సినిమా వాయిదా పడటం వలన ఆ డేట్ కి ఈ సినిమాలు వచ్చాయా అని కూడా అనిపించింది. ఇకపోతే ఆయ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు దాదాపు ఈ సినిమాకి రెండు కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి ఈ కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కేవలం కలెక్షన్లు మాత్రమే కాకుండా థియేటర్స్ కూడా పెరుగుతాయి. ఈ సినిమాను 200 థియేటర్ లలో విడుదల చేశారు.

- Advertisement -

నార్నే నితిన్(Narne Nithin), నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా తదితరులు ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో అంజీ కే మణిపుత్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ GA2 బ్యానర్‌పై లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, విద్యా కొప్పినీడు ఈ సినిమాను నిర్మించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు