NBK 109 : బాలయ్య సినిమాలో ముగ్గురు.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

NBK 109 : నందమూరి నటసింహం బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 109 వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకు ఎటువంటి టైటిల్ ను ఫిక్స్ చెయ్యలేదు. కానీ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో బాలయ్య రౌద్రంగా కనిపిస్తున్నారు.. ఆ లుక్ ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం..

ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది రోజుల నుంచి.. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. తర్వాత ఈ సినిమాలో ఊర్వశి రౌతెలా కూడా నటిస్తుందని.. ఈ అమ్మడు హీరోయిన్గా కాకుండా ఒక కీలక పాత్రలో కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో ఊర్వశి రౌతెలతో పాటు అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, నాని హీరోయిన్ శ్రద్దా శ్రీనాధ్ కూడా నటిస్తున్నారని వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బాలయ్య గతంలో నటించిన ఎన్నో సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించి మెప్పించాడు. చాలా కాలం తర్వాత మరోసారి బాలయ్య ముగ్గురు హీరోయిన్లతో స్క్రీన్ పైన కనిపించడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి.

Who are the three heroines in Balayya nbk 109 movie?
Who are the three heroines in Balayya nbk 109 movie?

కాగా ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు ఉండడానికి కారణం బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించడమే అని టాక్.. ఈ మూవీలో బాలయ్య మూడు డిఫరెంట్ షెడ్స్ లలో నటిస్తున్నారు. అలా ఈ మూడు డిఫరెంట్ షేడ్స్‌ కోసం ముగ్గురు హీరోయిన్స్ జంటగా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు బాలయ్య. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని బాలయ్య ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే సినిమాలతో పాటుగా అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ సీజన్ కు గెస్టుగా చిరంజీవి, నాగార్జున రాబోతున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు