Jyothi Poorvaj : బుల్లితెర పై ప్రసారం అవుతున్న సీరియల్స్ తో మంచి టాక్ ను అందుకున్న కొందరు ముద్దుగుమ్మలు సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని అందుకుంటున్నారు. అందులో జ్యోతి రాయ్ కూడా ఒకరు.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతున్న హీరోయిన్ జ్యోతి రాయ్.. ఈ పేరుతో చెబితే చాలా మందికి తెలిసి ఉండదు.. కానీ జగతి మేడమ్ అంటే ఇట్టే గుర్తుపడతారు.. ఈమె సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసి, సినిమాల్లో హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో పాప ఎంత హాట్ గా దర్శనం ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.. కానీ తాజాగా శారీలో హాట్ లుక్ లో కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అతను పూర్వాజ్ ఒక డైరెక్టర్.. ‘ఏ మాస్టర్‌పీస్’కు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. దీంతో ఇందులో జ్యోతికి కూడా నటించే అవకాశం దక్కింది.. ఆమె ప్రస్తుతం సినిమాల్లో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తుంది.. అలాంటి ఈమె సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఏ మాస్టర్‌పీస్ అనే సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ మూవీలో అరవింద్ కృష్ణ ఇందులో హీరోగా నటించాడు. ఈ మూవీ టీజర్‌ను బట్టి అరవింద్ కృష్ణ తల్లి పాత్రలో జ్యోతి రాయ్ నటించనుందని తెలుస్తోంది..
తాజాగా ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను నింపేసింది. బ్లాక్ శారీలో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. గులాబీ పువ్వును అడ్డుపెట్టుకొని కైపేక్కించే చూపులతో ఇచ్చిన స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్ తప్పా ఇంకా ఏ అప్డేట్ బయటికి రాలేదు. కొన్నిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్లో కూడా అసలు కథ ఏంటి అని పూర్తిగా రివీల్ చేయలేదు మేకర్స్. హీరోకు సూపర్ పవర్స్ వస్తాయని, ఆ తర్వాత తను కొంతమందిని ఎదిరించడానికి ముందుకొస్తాడనే విషయం మాత్రమే క్లారిటీ వచ్చింది.. మోడ్రన్ గా కనిపించే ఈమె ఇలా అమ్మవారి పాత్ర వెయ్యడం పై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. మరి సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి..