UI The Movie : ఎట్టకేలకు రిలీజ్ అప్డేట్ ఇచ్చిన ఉప్పీ..

UI The Movie : కన్నడ సూపర్ స్టార్ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క కన్నడలోనే గాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరోగా పేరున్న ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీసేవారు. అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ గా ఉపేంద్ర సినిమాలుండేవి. అయితే డైరెక్టర్ గా ఉపేంద్ర (Upendra) మెగాఫోన్ పట్టి చాలా కాలం అయింది. దర్శకుడిగా చివరిగా తొమ్మిదేళ్ల కింద ఉప్పి2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా, ఇప్పుడు త్వరలో ‘UI’ అనే చిత్రంతో దర్శకుడిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇక స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా చేస్తున్న ‘UI’ నుండి ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ టీజర్ తోనే తన మార్క్ చూపిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాని ప్రెజెంట్ చేస్తున్నారు.

UI The Movie starring Upendra will release in October

ఎట్టకేలకు రిలీజ్ అప్డేట్ ఇచ్చిన ఉప్పి…

అయితే కొన్నాళ్ల గా UI సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమి రాలేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందా అంటూ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ ఎట్టకేలకు సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చేసారు ఉపేంద్ర. UI సినిమా గురించి రిలీజ్ అప్డేట్ ని ఒక సాలిడ్ మోషన్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఆ పోస్టర్ లో ఉపేంద్ర ఒక స్మశానం లాంటి ఏరియాలో శాసించే గెటప్ లో కూర్చుని ఉన్నాడు. ఇక UI సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే బహుశా దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

- Advertisement -

భారీ బడ్జెట్ తో UI..

ఇక ఉపేంద్ర నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న UI సినిమా మొత్తం ఉపేంద్ర మార్క్ స్టయిల్లోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకు ముందు వచ్చిన అప్డేట్స్, సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక ఉపేంద్ర తన కెరియర్లో దర్శకత్వం వహిస్తున్న 11వ సినిమాగా UI తెరకెక్కుతుండగా, దాదాపుగా 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ జి. మనోహరన్, పి. శ్రీకాంత్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఉపేంద్ర ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్స్ అనే సరికొత్త టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో 80% గ్రాఫిక్స్ ఉంటాయని కూడా తెలియజేశారు. ఉపేంద్ర తో రీష్మా , సన్నీలియోన్, నిధి సుబ్బయ్య , ఇంద్రజిత్ లంకేష్, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు