Double Ismart : ఆ కళాఖండం సృష్టికర్త ఆయనేనట.. పరువుపోయిందిగా!

Double Ismart : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా ఎట్టకేలకు థియేటర్లలో నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. రామ్ – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్ నుండి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఆగష్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా థియేటర్లలో విడుదలైంది. ఇక దీనితో పాటు రవితేజ మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగలాన్, అలాగే ఆయ్ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పాత కథనే మళ్ళీ కిచిడీ చేసి తీసినట్టుందని నెటిజన్లు అంటున్నారు.

Criticism on social media on Ali's role in Double Ismart

ఆ పాత్ర సృష్టికర్త ఆయనేనట..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎక్కువ నెగిటివిటి ఓ పాత్రపైనే వస్తుంది. నెగిటివిటిలో సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ఆ పాత్ర మరో ఎత్తు అని చెప్పాలి. ఈపాటికే ఆ పాత్ర ఏంటని తెలిసిపోయి ఉంటుంది. అదే సీనియర్ కమెడియన్ అలీ పాత్ర. అమేజాన్ అడవుల నుంచి వచ్చిన అడివి మనిషి ‘బోకా’ పాత్రలో ఆలీ నటించాడు. అయితే ఈ పాత్ర ఎలా ఉంటుందో ట్రైలర్ లోనే చెప్పేయగా, సినిమాలో అంతకంటే వరెస్ట్ గా ఉందని చెప్పాలి. సినిమాలో అలీ పాత్ర చేసే చేష్టలు.. ఆయన హావభావాలు.. డైలాగుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు డైరెక్టర్ అలా ఎలా రాసారో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

- Advertisement -

ఇంత దారుణమా?

అయితే అలీ పాత్రలో కామెడీ కంటే బూతులే ఎక్కువున్నాయన్నది నిజం. అయితే ఆలీ కామెడీలో బూతు టచ్ ఉండడం కొత్త కాదు కానీ, ఇందులోని అలీ ట్రాక్ మాత్రం ప్రేక్షకులతో పాటు, అలీ ఫ్యాన్స్ సైతం అసహ్యించుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఇక రిలీజ్ రోజు నుండే ఆ పాత్రకి సంబంధించి లీక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు సినిమాపై ఇంత నెగిటివిటీకి ఈ రోల్ కూడా కారణమైందని అంటున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని, పూరి జగన్నాథ్ మరీ ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే అసలు ఈ కళాఖండాన్ని సృష్టించింది ఆలియేనట. స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆలీ చెప్పుకొచ్చారు. ఎవరు ఈ పాత్ర డిజైన్ చేసినా మొత్తంగా సినిమాకైతే పెద్ద బొక్క పడిందని చెప్పాలి. ఇక ఫస్ట్ డే పంద్రాగస్టు సెలవు వల్ల ఓపెనింగ్ వచ్చినా, వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు