Indra : అనుమానాలకు తెరపడింది. మరోసారి రీ రిలీజ్ ని కంఫర్మ్ చేసిన మేకర్స్..

Indra : టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ హీరోగా నిలిచి ఎన్నో రికార్డులు సృష్టించాడు. టాలీవుడ్ లో రెండో తరం హీరోల్లో ఎవరికీ లేనన్ని ఇండస్ట్రీ హిట్స్ చిరంజీవికి మాత్రమే ఉండడం విశేషం. అలాంటి ఇండస్ట్రీ హిట్స్ లో ఈ జెనరేషన్ కి కూడా గుర్తుండి పోయే సినిమా ‘ఇంద్ర’. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక పుస్తకం రాయొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటుంటారు. ఇంద్రసేనుడిగా మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన నటనకు తోడు దర్శకుడు బి.గోపాల్ మాస్ డైరెక్షన్, పరచూరి బ్రదర్స్ మాటలు ఇలా అన్నీ ఇంద్ర అఖండ విజయానికి తోడయ్యాయి.ఇక రీసెంట్ గానే ఇంద్ర సినిమా విడుదలై 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు మేకర్స్.

The makers have once again confirmed the re-release of Indra movie

రీ రిలీజ్ పై డౌట్స్..

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయాలనీ ఎప్పట్నించొ డిమాండ్ నడుస్తుంది. అయితే ఎట్టకేలకు మేకర్స్ రీ రిలీజ్ ని కన్ఫర్మ్ చేసారు. ఇంద్ర సినిమా విడుదలై 22 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ఇంద్ర రీ రిలీజ్ అని అనౌన్స్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రీ రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత మేకర్స్ నుండి చడీ చప్పుడు లేదు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా నటీనటులు, టెక్నిషియన్స్ ఎవ్వరూ మాట్లాడలేదు. దీంతో సినిమాను వాయిదా వేశారని అనుకున్నారు మెగాభిమానులు.

- Advertisement -

అనుమానాలకు తెర.. కంఫర్మ్ చేసిన మేకర్స్..

అయితే సినిమా రీ రిలీజ్ కొన్ని రోజులుగా వాయిదా పడిందంటూ, సోషల్ మీడియాలో ప్రచారం రాగా, తాజాగా మేకర్స్ ఈ అనుమానాలకు తెర దించారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నుండి ఇంద్ర రీ రిలీజ్ ని మరోసారి కంఫర్మ్ చేస్తూ, ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఆగష్టు 22న థియేటర్లలో విడుదల కానుందని కంఫర్మ్ చేసారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆసియన్ సురేష్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. బీ. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో సోనాలి బింద్రే, ఆర్తీ అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. మరి రీ రిలీజ్ లో ఇంద్ర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు