Rishab shetty: రూ.50 కూలీ జీతం నుండి.. నేడు నేషనల్ అవార్డు వరకు..!

Rishab shetty : డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 2022లో కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా, ఆ తర్వాత పెద్ద హిట్ అందుకొని దేశమంతా రిలీజ్ అయి అందరిని ఆశ్చర్యపరచడమే కాదు ఏకంగా రూ.400 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు పెట్టుబడి కేవలం రూ.20 కోట్లు మాత్రమే. కానీ రూ.400 కోట్లు వసూలు చేయడంతో పాటు కన్నడ సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ పరిచయమయ్యేలా చేశారు రిషబ్ శెట్టి. ఇందులో అద్భుతంగా నటించాడని దేశవ్యాప్తంగా ప్రశంసలు కూడా లభించాయి. దీనికి తోడు నిన్న ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల్లో కాంతారా సినిమా ఏకంగా రెండు అవార్డులను గెలుచుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా కాంతారా సినిమాకి గానూ రిషబ్ శెట్టి(Rishab shetty) కి అవార్డు ప్రకటించారు. అలాగే బెస్ట్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు కూడా ఈ చిత్రానికి ప్రకటించారు.

Rishab shetty: From a salary of Rs. 50.. to a national award today..!
Rishab shetty: From a salary of Rs. 50.. to a national award today..!

జూడోలో డిస్ట్రిక్ లెవెల్ ప్లేయర్..

ఈ నేపథ్యంలోనే రిషబ్ శెట్టికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రిషబ్ శెట్టికి ఇదే మొదటి భారీ పాన్ ఇండియా సక్సెస్ అయినా, సినిమా కష్టాలు చూసి నేడు ఈ స్థాయికి వచ్చాడు రిషబ్ శెట్టి. ఈ నేపథ్యంలోనే ఆయన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. రిషబ్ శెట్టి చదువుకునే రోజుల్లో ఆటల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొనే వాడట. జూడోలో డిస్ట్రిక్ లెవెల్ ప్లేయర్ కూడా. అయితే అది రిషబ్ తండ్రికి నచ్చకపోవడంతో బెంగళూరు పంపించి కాలేజీ విద్యను అక్కడే అభ్యసించేలా చేశారు. ఇక చిన్నప్పటి నుంచి టీవీలో పాటలు, సినిమాలు చూసి నటుడు అవుదాం అనుకున్నాడట రిషబ్ శెట్టి. ఆ తర్వాత ఉపేంద్ర సినిమాలు చూసి దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

వాటర్ క్యాన్లు సప్లై చేసేవారు..

చిన్నప్పుడు ఊర్లో వాళ్లతో కలిసి నాటకాలలో కూడా నటించిన ఈయన మీనాక్షి కళ్యాణి అనే యక్షగాన ప్రదర్శనలో షణ్ముగ పాత్రతో ఊర్లో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక బెంగళూరులో డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత రంగసౌరభం అనే బృందంలో చేరి నాటకాలు కూడా వేసేవారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఈయన తండ్రి చాలా కోప్పడ్డారట. ఇక డబ్బులు ఇవ్వను అని చెప్పడంతో తన అక్క కొద్దిగా హెల్ప్ చేసినా ఆర్థికంగా తిరిగి తాను సంపాదించుకోవాలని మినరల్ వాటర్ బిజినెస్ చేసేవారట. ఉదయం , సాయంత్రం పూట వాటర్ క్యాన్లు సప్లై చేసేవారు. రాత్రంతా క్యాన్లు సప్లై చేసి, ఆ వ్యాన్ లోనే నిద్రపోయేవారట రిషబ్ శెట్టి.

- Advertisement -

రోజుకు రూ.50 జీతం..

ఇకపోతే వాటర్ క్యాన్లు సప్లై చేస్తున్న సమయంలోనే ఒక క్లబ్ లో కన్నడ నిర్మాత ఎండి ప్రకాష్ కనిపించడంతో తన గురించి చెప్పి అవకాశం ఇమ్మని అడిగారట. డైరెక్షన్ కోర్స్ చదువుతూ పార్ట్ టైం చేస్తున్నాడని తెలిసిన సైనైడ్ అనే సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇప్పించారు ఆ నిర్మాత. ఆ సినిమాకి రోజుకు 50 రూపాయలు కూడా ఇచ్చేవారట. ఇక అదే సమయంలో లైట్ బాయ్ , మేకప్ , ఎడిటింగ్ అన్ని నేర్చుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ వాటర్ క్యాన్లు మోసే పనిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గండ హెండతి సినిమాకి క్లాప్ బాయ్ గా చేరి ఆ సినిమా మొత్తానికి 1500 రూపాయలు జీతం తీసుకున్నారు.ఇక అలా ఎన్నో కష్టాలు పడి, తినడానికి తిండి కోసం సంపాదించుకోవడానికి చిన్న చిన్న పాత్రలు చేస్తూ నేడు జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడంతో అందరూ ఆయన కష్టానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు