The GOAT Trailer : విజయ్ GOAT చిత్రం ట్రైలర్ వచ్చేసింది… ఈ స్టోరీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పక్కా..

The GOAT Trailer.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం.. ప్రముఖ డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తమిళ భాషా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక ఉగ్రవాద వ్యతిరేక స్క్వార్డ్ లోని మాజీ సభ్యులను అలాగే వారి మునుపటి చర్యల నుండి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా పరిష్కరించారు అనే కాన్సెప్ట్ తో ఈ గోట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్ , అజ్మల్ అమీర్, మోహన్, ప్రభుదేవా, జయరాం , స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి ,యోగి బాబు, యుగేంద్రన్, వైభవ్, ప్రేమి అమరెన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

The GOAT Trailer : The trailer of Vijay's GOAT movie is out... Pan India Blockbuster with this story..
The GOAT Trailer : The trailer of Vijay’s GOAT movie is out… Pan India Blockbuster with this story..

ఇదిలా ఉండగా భారీ అంచనాల మధ్య ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేసే అవకాశాలున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయాన్నికొస్తే.. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు లైలా – స్నేహ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

తండ్రీ కొడుకులుగా విజయ్ ద్విపాత్రాభినయం..

ట్రైలర్ విషయానికొస్తే.. యాక్షన్స్ సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది.. గాయ్స్ ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్.. 68 సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ అసైన్మెంట్స్, ఫీల్డ్ ఏజెంట్, ఒక స్పై ఇతడే ఈ ఆపరేషన్కు సరైన లీడర్ అంటూ ద్విపాత్రాభినయంలోని ఒక పాత్రను మనకు పరిచయం చేస్తారు. కార్ రేసింగ్, ఫుల్ యాక్షన్ సన్నివేశాలలో విజయ్ అదరగొట్టేశారు, విజయ్ ఇంకొక పాత్ర పేరు గాంధీ. ఎప్పుడు డ్రింక్ చేస్తూ జులాయి గా తిరిగే పాత్రలో నటించారు. పేరుకే గాంధీ కానీ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేసే క్యారెక్టర్ లో నటించారు. మొత్తానికి అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం , తండ్రీ కొడుకులు గా నటిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. హాలిడే ట్రిప్ కోసం అని బ్యాంకాక్ కి వెళ్లి, మిషన్ లో భాగంగా ఫ్యామిలీతో బుక్ అయిపోతారు. అక్కడ శత్రువుల నుంచి తనను తన కుటుంబాన్ని ఎలా కాపాడారు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చూపించారు. ఇక తండ్రి కొడుకులు ఇద్దరు శత్రువులను నాశనం చేసే యాక్షన్ సన్నివేశాలలో చాలా అద్భుతంగా నటించారు. మొత్తానికైతే ట్రైలర్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇక ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా కూడా అద్భుతంగా నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు