Prabhas – Hanu : ప్రభాస్ కొత్త మూవీ స్టోరీ ఇదే.. చిన్న మిస్టేక్‌తో స్టోరీ మొత్తం చేప్పేశారుగా..?

Prabhas – Hanu.. పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) బాహుబలి (Bahubali )సినిమా తర్వాత అన్నీ పాన్ ఇండియా చిత్రాలే ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా విభిన్నమైన జానర్లలో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రభాస్, ఇటీవల కల్కి2898AD అనే ఫ్యూచరిస్టిక్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin)దర్శకత్వంలో ప్రభాస్ ఈ చిత్రాన్ని చేసి ఏకంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు కాబట్టి రికార్డు సృష్టించారు. ఇక తదుపరి మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు.

Prabhas - Hanu : new movie story is this... with a small mistake, the whole story is added..?
Prabhas – Hanu : new movie story is this… with a small mistake, the whole story is added..?

ప్రభాస్ – హను రాఘవపూడి మూవీకి పూజా కార్యక్రమాలు..

ఈ సినిమా తర్వాత తెలుగులో మృణాల్ ఠాకూర్ , దుల్కర్ సల్మాన్ జంటగా వచ్చిన సీతారామం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని అవార్డుల వర్షం కురిపించిన డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu raghavapudi)దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో ప్రాజెక్టు ప్రకటించినప్పుడే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి.దీనికి తోడు తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరిగాయి.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

చిన్న మిస్టేక్ తో స్టోరీ మొత్తం రివీల్..

ఇదిలా ఉండగా .. తాజాగా ఈ సినిమా చంద్రబోస్ కాలం నాటి సమయంలో జరిగిన కథ అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు . అయితే తాజాగా పూజా కార్యక్రమాల్లో భాగంగా క్లాప్ బోర్డు పై చేసిన చిన్న మిస్టేక్ స్టోరీ మొత్తాన్ని రివీల్ చేసిందని చెప్పాలి ..మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

చంద్రబోస్ కాలం నాటి కథ..

పూజా కార్యక్రమాలలో భాగంగా క్లాప్ బోర్డు పై ఆజాద్ హిందూ ఫౌజ్ ఫ్లాగ్ అని ఉంది. దీన్ని బట్టి చూస్తే సినిమా స్టోరీ చంద్రబోస్ టైంలో ఉంటుందని, హీరో చంద్రబోస్ కి శిష్యుడు అని, ముఖ్యంగా స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారితో వార్ ఎలా సాగింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు సినిమాకు సంబంధించి వచ్చిన అన్ని అప్డేట్స్ కూడా ఇప్పుడు నిజమని తెలుస్తోంది పూజా కార్యక్రమాలు అలాగే సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్తోనే సినిమా స్టోరీ పై క్లారిటీ వచ్చేసింది. అయితే భారీ అంచనాల మధ్య తెరకెక్కించబోయే ఈ సినిమాకు సంబంధించి మొదట్లోనే ఇలా లీక్ చేయడం పై ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు