Prabhas -Hanu: భారీ బడ్జెట్..కానీ హీరోయిన్ విషయంలో రిస్క్ చేస్తున్నారేమో..?

Prabhas – Hanu: ప్రస్తుతం ప్రభాస్ ఒకవైపు గతంలో సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే.. మరొకవైపు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. దీనికి తోడు కొత్త ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులలో ఫుల్ జోష్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్, మరొకవైపు సీతారామం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నేడు ఘనంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాగా పేరు మోసిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు పోస్టర్ తో సహా అనౌన్స్మెంట్ చేసింది చిత్ర బృందం. మైత్రి మూవీ మేకర్స్ అంటే భారీ బడ్జెట్ తో వస్తుందని అందరికీ తెలిసిందే. ఇక అందులోనూ రూ.1000 కోట్ల మార్కెట్ ఉన్న ప్రభాస్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం మైత్రి వారు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Prabhas-Hanu: Big budget..but are you taking risk with the heroine..?
Prabhas-Hanu: Big budget..but are you taking risk with the heroine..?

భారీ బడ్జెట్ తో హను – ప్రభాస్ కాంబో..

మైత్రి మూవీ మేకర్స్ మరొకవైపు ప్రభాస్ ఇంకొకవైపు మను రాఘవపూడి ఇంతటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో చిత్రం అంటే అభిమానులలో అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి అంతేకాదు ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈరోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ఎవరిని తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. ఈ పూజా కార్యక్రమాలలో ప్రభాస్ పక్కన ఒక కొత్త అమ్మాయి సందడి చేయడం మనం చూడవచ్చు. ఇందులో కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

హీరోయిన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్..

ఈ అమ్మాయి పేరు ఇమాన్వి.. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్.. ఈమె చూడడానికి మంచి ఫిగర్ తో చాలా అందంగా ఉంది. దీనికి తోడు ఈమె ఇందులో హీరోయిన్ గా నటిస్తోందని చెప్పడంతో నెటిజన్స్ అందరూ ఈమె మంచి ఎక్స్ప్రెషన్ క్వీన్, డాన్స్ అదరగొట్టేస్తుంది అంటూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రభాస్ అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. సాధారణంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు అంటే హీరోయిన్ కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉండే అమ్మాయిని తీసుకొస్తారు. ముఖ్యంగా హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా కూడా సినిమా హిట్ అవుతుందనే ఆలోచన దర్శక నిర్మాతల్లో ఉంటుంది. అలాంటిది భారీ బడ్జెట్ తో, హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరక్కెక్కుతున్న ఇలాంటి చిత్రంలో ఒక యంగ్ బ్యూటీ ని అందులోనూ ఇప్పటివరకు తెరపై కనిపించని ఒక అమ్మాయిని ఇంత పెద్ద స్టార్ హీరో పక్కన హీరోయిన్గా చూపించడం అంటే పెద్ద రిస్క్ చేస్తున్నారేమో అని చెప్పవచ్చు.

- Advertisement -

రిస్క్ చేస్తున్న చిత్ర బృందం..

సాధారణంగా ఇలాంటి వాళ్ళని టైర్ -2 హీరోల సినిమాలలో నటింప చేయవచ్చు. కానీ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలో ఒక కొత్త అమ్మాయికి అవకాశం కల్పించడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అయితే ఈమెను హను రాఘవపూడి తీసుకొచ్చారా? లేదా ఏదైనా రికమండేషన్ ద్వారా ఈమె ఈ సినిమాలో అవకాశం దక్కించుకుందా? లేక సొంత టాలెంట్ తో అవకాశం సొంతం చేసుకున్న అనే విషయాలు తెలియాల్సి ఉంది.. మొత్తానికైతే భారీ బడ్జెట్ అందులోనూ పాన్ ఇండియా స్టార్ హీరో పక్కన ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్గా పెట్టడం అంటే రిస్క్ చేస్తున్నారేమో.. మొత్తానికైతే ఇంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న ఇమాన్వి తన టాలెంట్ను పూర్తిగా ఉపయోగించి ఇందులో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు