Double Ismart : టాలీవుడ్ పరువు మొత్తం గోవింద… బాలీవుడ్ లో పరిస్థితి ఇది

Double Ismart :టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో భారీ అంచనాలతో విడుదలైన సినిమా “డబుల్ ఇస్మార్ట్”. పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక చెత్త సినిమా వచ్చిందని నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు పూరి జగన్నాథ్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదని చెప్పాలి. ఎలాగైనా హిట్ కొట్టాలని, పూరి జగన్నాథ్ మరీ ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పూరి వరెస్ట్ డైరెక్షన్ తో పాటు, పలు పాత్రల క్యారెక్టరైజేషన్ చెత్తగా రాసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.

Hindi audience trolling Tollywood due to Double Ismart movie

బాలీవుడ్ లో డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి ఇది..

ఇక డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ని ముందు నుండి బాలీవుడ్ లో కూడా ప్రమోట్ చేసారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తామని అన్నా, సౌత్ భాషల్లో కుదరలేదు. ఇక ఇతర భాషలను పక్కన బెడితే, తెలుగుతో పాటు హిందీలో భారీగా ప్రమోట్ చేసారు. సంజయ్ దత్ ఈ సినిమాకోసం హిందీలో బాగానే ప్రమోట్ చేసాడు. పైగా హిందీలో రామ్ సినిమాలు యూట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకుంటుండడంతో డబుల్ ఇస్మార్ట్ హిందీలో మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఎంత చెత్త టాక్ వచ్చిందంటే, బాలీవుడ్ లో రెండు రోజుల్లో వచ్చిన కల్లెక్షన్లు 5 లక్షలు. అంటే ఒక థియేటర్ కి ఒక రోజుకి వచ్చే కలెక్షన్లు అని అనుకోవచ్చు.

- Advertisement -

టాలీవుడ్ పరువు తీసేసిన డబుల్ ఇస్మార్ట్…

ఇక బాలీవుడ్ లో మొన్నటివరకు, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతో పొగిడిన జనాలు ఇప్పుడు ఈ ఒక్క సినిమాని అడ్డం పెట్టుకుని టాలీవుడ్ ని దూషిస్తున్నారు. ఇక ఇంతకు ముందే లైగర్ తో బాలీవుడ్ లో పరువు పోగొట్టుకున్న పూరి జగన్నాథ్, ఇప్పుడు తన పరువుతో పాటు, తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు తీసాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మా దగ్గరే అనుకుంటే మీ దగ్గర ఇంత చెత్త సినిమాలు వస్తాయా అంటూ.. హిందీ జనాలు తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తున్నారు. ఇక ఇది గమనించిన టాలీవుడ్ ఆడియన్స్ డబుల్ ఇస్మార్ట్ వల్ల టాలీవుడ్ పరువు గోవిందా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి జరిగిన ఈ తప్పుకు పూరి జగన్నాథ్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు