Thangalaan Collections : బెటర్ అనిపించుకున్న ఈ సినిమాకు కూడా డ్రాప్ అవడమేంటి?

Thangalaan Collections : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఆగష్టు 15న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ డ్రామా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. మరీ అద్భుతం అనిపించే రేంజ్ లో కాకపోయినా సినిమాకి మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక టాలీవుడ్ లో కూడా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కన్నా ఈ తంగలాన్ బెటర్ అన్న టాక్ వస్తుంది. అయితే ఫస్ట్ డే మిగతా చిత్రాల పోటీ వల్ల డీసెంట్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది. అయితే రెండో రోజు నుండి ఈ సినిమా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ రెండో రోజు కలెక్షన్లు చూస్తే షాకిచ్చేలా ఉన్నాయి.

Thangalaan 2days World Wide Collections

రెండో రోజు భారీ డ్రాప్ ఊహించలేదు..

అయితే తంగలాన్ (Thangalaan Collections) సినిమా తొలిరోజు అదరగొట్టగా, రెండో రోజు స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుందని అనుకున్నారు అభిమానులు. కానీ అలా జరగలేదు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా, పర్వాలేదనిపించింది. కానీ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే, రెండో రోజు ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే డ్రాప్ అయ్యాయని చెప్పాలి. రెండో రోజు కేవలం 3.10 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగా, మొత్తం మీద 6.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా తంగలాన్ 32.60 కోట్ల గ్రాస్ 15.55 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అయితే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కూడా ఇంతలా వసూళ్లు తగ్గిపోతాయని అనుకోలేదు.

- Advertisement -

బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా?

అయితే రెండో రోజు కలెక్షన్లు ఇంతలా డ్రాప్ అవడంతో ట్రేడ్ విశ్లేషకులు అసలు బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా లేదా అని చర్చిస్తున్నారు. పైగా ప్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు డ్రాప్ అయ్యాయంటే ఏమైనా అనుకోవచ్చు. కానీ మంచి టాక్ తెచ్చుకున్న తంగలాన్ కు కూడా ఇలా డ్రాప్ అవడమేంటి అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా 65 కోట్ల బిజినెస్ చేసిన తంగలాన్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 50 కోట్ల షేర్ రావాల్సిందే. మరి లాంగ్ రన్ లో తంగలాన్ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు