OTT Movie : ఫ్యూచర్ ను చూపించే సైన్స్ ఫిక్షన్ మూవీ… చూశారంటే ఫ్యూజులు అవుట్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఊహకు కూడా అందని విషయాలను ఇలాంటి సై-ఫై సినిమాలలో నోళ్లు వెళ్లబెట్టుకుని మరీ చూసేలా తెరకెక్కిస్తారు హాలీవుడ్ మేకర్స్. భాష అర్థం కాకపోయినా ఇలాంటి సినిమాలను చూసే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇండియన్ లాంగ్వేజెస్ లో డబ్ అయితే పండగే. ఈరోజు మన మూవీ సజేషన్ ఫ్యూచర్ ను చూపించే ఒక క్రేజీ సైన్స్ ఫిక్షన్ మూవీ. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? ఇప్పటిదాకా ఎఏ సినిమాను చూశారా ? లేదా మిస్ అయ్యారా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హాట్ స్టార్ లో అందుబాటులో..

సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారి బుర్రలో తరచుగా కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. అసలు మనుషుల పుట్టుక ఎలా జరిగింది? మనుషుల్ని ఎవరు, ఎలా క్రియేట్ చేశారు? ఎలియన్స్ నిజంగానే ఉన్నాయా? ఉంటే భూమి మీదకు ఎలా రాగలిగాయి ? వాటి వల్ల ప్రమాదం ఉంటుందా? ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలు మెదడును తొలిచేస్తాయి. ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ.

Prometheus

- Advertisement -

స్టోరీ విషయానికొస్తే..

భూమి మీద జీవ రాశి లేని టైమ్ నుంచే మూవీ స్టార్ట్ అవుతుంది. ఎటు చూసినా కొండలు కోనలు, గలగలా పారే నదులు, జలపాతాలు మాత్రమే ఉంటాయి. అలాంటి టైమ్ లోనే స్పేస్ నుంచి ఓ ఏలియన్ భూమి మీదకు ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆ ఏలియన్ ఓ జలపాతం అంచున నిలబడి తనతో పాటు తెచ్చుకున్న ఓ డ్రింక్ ను తాగుతుంది. ఆశ్చర్యకరంగా వెంటనే అది ముక్కలు ముక్కలుగా మారి ఆ నీళ్ళలో పడుతుంది. దాని డీఎన్ఏతో భూమి మీద కొత్త జీవరాశి పుట్టడం స్టార్ట్ అవుతుంది. కొన్ని లక్షల ఏళ్ల తరువాత ఆ జీవరాశి మనుషిలా ప్రాణం పోసుకుంటుంది. ఇప్పటిదాకా గతాన్ని చూశాము మనం. ఇక ఇప్పుడు ఫ్యూచర్ 2091లోకి వెళ్తాం. ఐర్లాండ్ లోని కొండలలో కొంతమంది సైంటిస్టులు తవ్వకాలు చేపడతారు. అక్కడున్న ఓ గుహలో 3500 ఏళ్ల ముందు గీసిన ఓ పిక్చర్ బయట పడుతుంది. అయితే అందులో ఓ మనిషి కొన్ని నక్షత్రాలను చూపిస్తున్నట్టుగా ఉండడంతో మనుషుల్ని సృష్టించిన వారు అక్కడే ఉన్నారని, స్పేస్ కు తమను ఆహ్వానిస్తున్నారని ఆ సైంటిస్టులు నమ్ముతారు. దీంతో అందరూ కలిసి ఓ స్పేస్ షిప్ లో వేరే గ్రహానికి బయల్దేరుతారు. వీళ్ళను ఆ గ్రహం దగ్గరకు తీసుకెళ్ళే బాధ్యతను ఓ రోబో తీసుకుంటుంది. మరి అనుకున్నట్టుగా ఈ సైంటిస్టులు అక్కడికి చేరుకున్నారా? అక్కడికి వెళ్ళాక ఏంటి పరిస్థితి ? మనుషుల్ని క్రియేట్ చేసిన వారు కన్పించారా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ప్రోమేతియస్ అనే ఈ సినిమాను మస్ట్ వాచ్. అసలు ఇప్పటిదాకా ఈ సినిమా చూడని వారు ఖచ్చితంగా ఓ లుక్ వేయాల్సిన మూవీ ఇది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు