P.Susheela : లెజెండరీ గాయని పి.సుశీలకు అస్వస్థత.. డాక్టర్లేమంటున్నారంటే!

P.Susheela : సౌత్ ఇండియన్ లెజెండరీ గాయని పి.సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు లోనయ్యారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో బి. సుశీల అడ్మిట్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పి. సుశీల తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా 9 భాషలలో 40,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. దాదాపు డెబ్బై ఏళ్లగా దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తుమ్పును తెచ్చుకున్నారు. తన ఆత్మీయ స్వరంతో అభిమానులను కట్టిపడేసిన బి. సుశీల తన వయసు రీత్యా కష్టమవడంతో, సినిమాల్లో పాడడం మానేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పి. సుశీల, గత జూన్‌లో తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆలయంలో ముడికానికం చెల్లించారు.

Legendary singer P. Sushila was admitted to the hospital

ఇక గత కాలంగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్న పి.సుశీల (P.Susheela) కాస్త అస్వస్థతకు గురి కావడంతో, కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆళ్వార్ పేటలోని, కావేరీ ఆస్పత్రిలో పి.సుశీలను తీసుకెళ్లి అడ్మిట్ చేసారు. అయితే సుశీల గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. అయితే, పి.సుశీల వృద్ధాప్య సమస్యలతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో పి.సుశీల చికిత్స తీసుకొంటున్నారని.. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నారని సమాచారం.

- Advertisement -

ఇక పి.సుశీల తొందరగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని పి.సుశీల అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక సుశీల తెలుగులో కొన్ని వేల పాటలు పాడగా, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలు పాడడం జరిగింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న సుశీల మళ్ళీ ఆరోగ్యాంగా తిరిగి రావాలని, అభిమానులకు తన గొంతును వినిపించాలని కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు