Sreeleela: మెగా ఆఫర్ ను పక్కన పెట్టేసి శ్రీలీలా తప్పు చేస్తోందా.?

Sreeleela: కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీలా(Sreeleela). శ్రీ లీలా నటించిన పెళ్లి సందడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయిన కూడా శ్రీలీలకు వరుసగా అవకాశాలు వచ్చాయి. మామూలుగా ఒక సినిమా హిట్ అయితేనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. కానీ ఒక డిజాస్టర్ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు పొందుకొని నేడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు సాధించింది.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో మంచి సూపర్ హిట్స్ అందుకుంటుంది. త్రినాధరావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వంలో రవితేజ(Raviteja) సరసన చేసిన ధమాకా(Dhamaka) సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా ఎనర్జిటిక్ గా డాన్స్ వేయడం శ్రీలీలాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఒక ప్రస్తుతం స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలానే పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో కూడా కనిపించనుంది.

ఇకపోతే వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). హీరోగా చేస్తున్న సినిమా విశ్వంభర(Vishwambhara). ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి టైపులో ఈ సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అది ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రీ లీలను సంప్రదించిందంట చిత్ర యూనిట్. ఇక హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ తాను చేయనని చెప్పేసిందట.

- Advertisement -

Sreeleela

కేవలం శ్రీ లీల మాత్రమే కాకుండా గతంలో చాలామంది హీరోయిన్లు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఐటెం సాంగ్స్ చేస్తూ కనిపించారు. వాటి వలన పెద్దగా ఒరిగేదేమీ ఉండదు సమంత కాజల్ లాంటి వాళ్లు కూడా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే ఇప్పుడు విశ్వంభర సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ రిజెక్ట్ చేసి శ్రీ లీలా తప్పు చేసింది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు