Thangalan: మాళవిక పాత్రను వదులుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

Thangalan.. కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు హీరో విక్రమ్ కు మంచి సక్సెస్ ను కూడా తీసుకు వచ్చింది. గతంలో వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న విక్రమ్ కు ఈ సినిమా కాస్త ఊరట ఇచ్చింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన విక్రమ్ పై అభిమానులు , నెటిజన్ లు ప్రశంసలు సైతం తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి విక్రం ఎంత కీలకమో అలాగే మాళవిక మోహనన్ కూడా అంతే కీలకమని చెప్పవచ్చు. అలాగే ఇందులో పార్వతి తిరువోతు, పశుపతి వంటి వారు కూడా నటించారు.

Thangalan: The star heroine who gave up the role of Malvika.. Who is..?
Thangalan: The star heroine who gave up the role of Malvika.. Who is..?

నెగిటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటించిన మాళవిక..

మొదటి రోజే తంగలాన్ చిత్రం రూ.12.6 కోట్ల రూపాయలను రాబట్టింది. ఏకంగా తమిళంలోనే రూ.10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్ చేసిందట. ఇక రెండవ రోజు ఇండియాలో రూ.4.75 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది. మొత్తం మీద రెండు రోజులలోనే రూ.18.5 కోట్ల రూపాయల వరకు నికర వసూలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలోని ఆర్తి పాత్రలో నటించిన మాళవిక మోహనన్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇందులో ఈమె పూర్తిగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించింది.

మాళవిక పాత్రను మిస్ చేసుకున్న రష్మిక..

మొదట ఈ పాత్రను సైతం డైరెక్టర్ పా.రంజిత్ ఒక స్టార్ హీరోయిన్ కి వినిపించారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరుపొందిన హీరోయిన్ రష్మిక మందన్న. కథ విన్నప్పుడు అంతా బాగున్నప్పటికీ తన డేట్లు కేటాయించడంలో సమస్యలు కారణం వల్ల రష్మిక ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు డైరెక్టర్ తెలియజేశారు. ఆ తరువాతే రష్మిక స్థానంలో మరొక హీరోయిన్ మాళవిక మోహనన్ ను ఎంపిక చేశాము అంటూ డైరెక్టర్ పా. రంజిత్ వెల్లడించారు. ఇకపోతే తంగలాన్ చిత్రంలో మాళవిక మోహనన్ తన నటనతో, గెటప్ తోనే అందరిని భయపెట్టిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమాతో మాళవిక మోహనన్ కి మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

- Advertisement -

రష్మిక ఫ్యాన్స్ లో నిరాశ..

ఇక రష్మిక విషయానికి వస్తే.. డేట్స్ విషయంలో క్లాష్ అవడం వల్లే అద్భుతమైన పాత్రను వదులుకుంది ఈ ముద్దుగుమ్మ. రష్మిక తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. గీతగోవిందం సినిమాతో ఊహించని ఇమేజ్ దక్కించుకున్న ఈమె, ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మరింత పేరు దక్కించుకుందని చెప్పవచ్చు. ఒక తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషా చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పేరు దక్కించుకున్న రష్మిక ఇప్పుడు ఒక గొప్ప పాత్రను వదులుకొని అభిమానులను నిరాశ పరుస్తోంది.. ఒకవేళ ఈ పాత్ర రష్మిక చేసి ఉండి ఉంటే ఆమె రేంజ్ మరో స్థాయికి వెళ్లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు