Hanu: ప్రతిసారి అంత మంచి హీరోయిన్స్ ను ఎలా పట్టుకుంటావ్ హను.?

Hanu: ఒకప్పుడు లవ్ స్టోరీస్ అంటే మణిరత్నం అద్భుతంగా తెరకెక్కిస్తారు అంటూ మంచి పేరును సాధించాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ కూడా అద్భుతంగా లవ్ స్టోరీస్ తీస్తాడు అని పేరు సాధించాడు. ఇక తెలుగులో లవ్ స్టోరీస్ ని అద్భుతంగా డీల్ చేయగల దర్శకుడు ఎవరు అంటే హను రాఘవపూడి అని చెప్పొచ్చు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను. ఒక సినిమాను పొయిటిక్ వే ఎలా చూపించొచ్చు అని మొదటి సినిమాతోనే నిరూపించాడు. అయితే ఈ దర్శకుడు పైన మణిరత్నం ప్రభావం ఉంది అని అప్పట్లోనే చాలామంది కామెంట్స్ కూడా చేశారు.

కాకపోతే హను మాటల్లో చెప్పాలి అంటే మణిరత్నం(Mani Ratnam) కంటే కూడా చాలామంది తెలుగు దర్శకుల ప్రభావం హను రాఘవపూడి మీద ఉంది. కె విశ్వనాథ్(K Viswanath), బాపు(Bapu) వంటి దర్శకులు ప్రభావం హను మీద ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా విశ్వనాధ్ బాపు వంటి దర్శకులు సినిమాలలో హీరోయిన్ ని చాలా అందంగా చూపిస్తారు. ఆ సినిమాలలో హీరోయిన్లు ను చూసినప్పుడు ఒక నిండైన తెలుగుదనం కనిపిస్తుంది. ఈ రోజుల్లో అలా హీరోయిన్ చూపించే ఏకైక దర్శకుడు హను అని చెప్పాలి.

మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వం వహించిన సినిమాలలో హీరోయిన్ కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అందాల రాక్షసి సినిమాలలో లావణ్య త్రిపాఠి, కృష్ణ గాడి వీర ప్రేమ కథ మెహరీన్, పడి పడి లేచే మనసు సాయి పల్లవి, లై మేఘ ఆకాష్, సీతారామం మృణాల్ వీరందరూ కూడా ఆ సినిమాలలో చాలా అందంగా కనిపిస్తారు. ఇదే హీరోయిన్స్ వేరే సినిమాలు కూడా చేశారు అయితే హను సినిమాలలో కనిపించినంత అందంగా వేరే సినిమాల్లో కనిపించరు అనేది వాస్తవం.

- Advertisement -

Prabhas Hanu

ఇక హను ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismail) అని కొత్త నటి ప్రభాస్ సరసన కనిపించబోతుంది. అధికారికంగా ఈ సినిమా పూజ జరిపింది చిత్ర యూనిట్. అయితే ఈ పూజా కార్యక్రమంలో ఇమాన్వి అందరి అటెన్షన్ను గ్రాబ్ చేసింది. కేవలం హనుమ సినిమాల్లో హీరోయిన్స్ అంత అందంగా ఉంటారా అని మరోసారి రుజువయింది. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రతిసారి ఎంత మంచి అమ్మాయిల్ని ఎలా పట్టుకుంటావు అంటూ హను ను అడగటం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు