Jhonny Master : అప్పుడు జేసీబీ ఆపరేటర్ , నేడు నేషనల్ అవార్డు అందుకున్నాడు

Jhonny Master : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ (Jhonny Master) ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒక సినిమాను చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు జానీ మాస్టర్. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సినిమా చేయటానికి చాలా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కి కథను కూడా చెప్పాడు జానీ. ఆ తర్వాత ఇండస్ట్రీలో ముందు ఏదో ఒక పని చేయాలి అంటూ డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నెల్లూరు లోని ఇసుకతిన్నెల పై గంటల గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు.

ముందుగా కొన్ని సినిమాలలో సైడ్ డాన్సర్ గా పనిచేశాడు జానీ. ఆ తర్వాత నితిన్(Nithin)నటించిన ద్రోణ(Drona) సినిమాలో పాటలకు కంపోజ్ చేసి అక్కడితో మంచి పేరును సాధించుకున్నాడు. సినిమాలో పాటలకు కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్స్ తో అప్పట్లో ఈటీవీ సంస్థ డి అనే ప్రోగ్రాంను పెట్టింది. ఆ ప్రోగ్రాం లో జానీ కూడా తన టీం తో పాటు పాల్గొన్నాడు. ఆ షో తోనే జానకి మంచి గుర్తింపు లభించింది. జానీ ఆటిట్యూడ్ జానీ మాట్లాడే విధానం ఇవన్నీ కూడా అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ని తీసుకొచ్చి పెట్టాయి. ఆ షో మధ్యలో నుంచి కూడా జానీ వెళ్లిపోయాడు. మళ్లీ వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చాడు.

Jani Master

- Advertisement -

అయితే అప్పట్లో జానీని చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాపర్ గా కొరియోగ్రఫీ తెలియదు అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే అప్పుడు కామెంట్స్ చేసిన వాళ్ళ కంటే కూడా జానీ మాస్టర్ ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ , మెగాస్టార్ చిరంజీవి వంటి ఎందరో స్టార్ హీరోలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా జానీ మాస్టర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి.

ధనుష్(Dhanush) నిత్యమీనన్(Nitya Menon) రాశి కన్నా(Rashi Khanna) కలిసి నటించిన తెలుగు సినిమాలోని మేఘం కరిగేనా అనే పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు జానీ మాస్టర్. ఇది కేవలం జానీ మాస్టర్ కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవమని చెప్పాలి. ఇకపోతే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా జనసేన పార్టీలో కూడా చేరి పవన్ కళ్యాణ్ పైన తన అభిమానాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు జానీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు